పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, రెండు డిపోల ఏర్పాటు
ఈసారి గిరిజనులకే అమ్మకాల లెసైన్
ములుగు : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో పోలీసు, ఎక్సైజ్ శాఖల సంయుక్త పర్యవేక్షణలో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకుస్ సబర్వాల్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి సారిలా కాకుండా ఈసారి జాతరలో నకిలీ మద్యం, గుడుంబా అరికట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్ జిలాల్ల నుంచి ఎన్‌డీపీ మద్యం తరలించేందుకు అవకాశమున్న గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అంతేకాకుండా ఏడు మొబైల్ బృందాలు, 11 చోట్ల చెక్‌పోస్టులు, 12 సెక్టోరియల్ టీంలు ఏర్పాటుచేయడమే కాకుండా, పోలీసు శాఖ సహకారంతో ఈసారి వాకీటాకీలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జాతర సందర్భంగా బెల్లం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, ములుగు, పరకాల, ఏటూరునాగారం, భూపాపల్లి, ములుగులో విస్తృత తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల కోసం గతంలో 22 షాపులకు తాత్కాలిక లెసైన్సులు ఇవ్వగా, ఈసారి స్థానిక గిరిజనులకే వారం పాటు అమ్మకాలకు లెసైన్సులు మంజూరు చేస్తామని అకున్ సబర్వాల్ వెల్లడించారు.
మద్యం సరఫరాకు తాడ్వాయిలో ప్రధాన డిపో, రెడ్డిగూడెంలో మినీ డిపో ఏర్పాటుచేస్తామన్నారు. గత జాతరలో రూ.1.40కోట్ల మేర మద్యం విక్రయాలు జరగగా, ఈసారి రూ.2కోట్ల వరకు జరగొచ్చనే అంచనా ఉందని తెలిపారు. కాగా, జాతర ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ర్ట ఎకై ్సజ్ కమిషనర్ శుక్రవారం జిల్లాకు రానున్నారని ఆయన వివరించారు. సమావేశంలో ఓఎస్‌డీ శ్రీనివాస్‌రావు, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సాయిశేఖర్, ములుగు సీఐ ఇంద్రప్రసాద్, ఎస్సైలు మాన్‌సింగ్, సరిత తదితరులు పాల్గొన్నారు.
జాతరలో నకిలీ మద్యానికి చెక్
Published Fri, Jan 8 2016 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement