సాక్షి, న్యూఢిల్లీ : నారీ శక్తి పురస్కారాన్ని 2017 సంవత్సరానికిగానూ తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న ఉద్యమాలకు గుర్తింపుగా తెలగాణకు చెందిన జయమ్మను నారీ శక్తి పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.
గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. అమాయక మహిళలను పడుపు వృత్తిలోకి నెట్టుతున్న శక్తులను అడ్డుకోవాలని, హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment