జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్‌పీ) ఉపనేత పదవి దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి జీవన్‌రెడ్డి పేరును ప్ర కటించారు. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన టి.జీవన్‌రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుందని ముం దుగా ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ ఆ పదవి జానారెడ్డికి దక్కింది. దీంతో టీపీసీసీ అధ్యక్ష పీఠం అందివచ్చే అవకాశం ఉందనుకున్నారు.
కాంగ్రెస్ జాబితాలో జీవన్‌రెడ్డి పేరు లేకపోవడం, సీఎ ల్‌పీ ఉపనేత పదవి రావడంతో టీపీసీసీ పదవి లేనట్టేనని తేలిపోయింది. జీవన్‌రెడ్డి 1983లో రాజ కీయ ఆరంగేట్రం చేసి టీడీపీ నుం చి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచా రు. కాంగ్రెస్‌లో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈయనకు ఉప ప్రతిపక్ష నాయకుడి హోదా రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.