'కేసీఆర్ ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారు' | Jeevan reddy slams kcr cabinet | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారు'

Published Tue, Jun 3 2014 11:04 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'కేసీఆర్ ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారు' - Sakshi

'కేసీఆర్ ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారు'

హైదరాబాద్ :  కేసీఆర్ మంత్రివర్గంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్లో సామాజిక న్యాయం లోపించిందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న కేసీఆర్.... మాట తప్పి దళిత వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టారన్నారు.

సామాజిక తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరులైన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన వారిని సమరయోధులుగా గుర్తించి గౌరవించాలన్నారు. అనేక కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కృతజ్ఞతలు తెలుపకపోవడం బాధాకరమని జీవన్ రెడ్డి వ్యాఖ్యాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement