బోధన్ : ఇసుక అక్రమ రవాణాదారులపై మహారాష్ట్ర అధికారులు కొరడా ఝుళిపించారు. బోధన్ మండలంలోని సాలూర శివారులో ‘తెలంగాణ- మహారాష్ట్ర’ మధ్య ప్రవహిస్తున్న మంజీరా నది అవతలి ఒడ్డున, నాందేడ్ జిల్లా, బిలోలి తాలూకా పరిధిలోని ఏస్గీ ఇసుక క్వారీని నాందేడ్ జిల్లా కలెక్టర్ మంగళవారం సీజ్ చేశారు. కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు ఇసుక క్వారీపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని గుర్తించారు. దీంతో మధ్యాహ్నం నుంచి అక్కడ ఇసుక తవ్వకాలు నిలి చిపోయూరుు. మంజీరా నదికి ఆనుకుని మహారాష్ట్ర భూ భాగంలోని పట్టాభూమిలో ఇసుక తరలింపునకు అనుమ తి పొందిన మాఫియా పరిమితికి మించి యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టింది.
వారం రోజుల నుంచి రవా ణా సాగుతోంది. కొత్త వంతెనపై నుంచి వెళ్లాల్సిన భారీ లోడ్ లారీలు పాత వంతెన మీదుగా వెళ్తున్నారుు. సా లూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా అక్రమ రవాణా సాగుతున్నా మన జిల్లా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించింది. దీంతో ట్రాఫిక్ కు అంత రాయం కలుగడమేకాకా, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వరుస గా రెండు రోజుల నుంచి కథనాలు ప్రచురిస్తోంది. దీనికి స్పందించిన నాందేడ్ కలెక్టర్ క్వారీని తనిఖీ చేశారు. పరి మతికి మించి ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించి క్వారీ ని సీజ్ చేశారు.
గ్రామస్తులు మొత్తుకున్నా
ఎస్గీ క్వారీ నుంచి వారం రోజులుగా ఇసుక రవాణా సాగుతోంది. ఓవర్‌లోడ్ వాహనాలతో మన రోడ్లు ధ్వంసమవుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వ చ్చారుు. అటువైపున అనుమతి పొందిన మాఫియా,మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నారని గ్రామస్తులు మొత్తుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మా ఫియా ఆగడాలను నియంత్రించడంలో అధికారులు ఉదాసీనత చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్గీ క్వారీ నుంచి రోజుకు 200 లారీలు, టిప్పర్లు ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారుు. బోధన్ నుంచి ఎడపల్లి, నిజామాబా ద్, డిచ్‌పల్లి, కామారెడ్డి మీదుగా, మరో వైపు బాన్సువాడ మీదుగా హైదరాబాద్‌కు వాహనాలు నడి చారుు.
హైదరాబాద్‌లో ఇసుక డిమాండ్
హైదరాబాద్‌లో ఇసుకకు ధర అధికంగా ఉండటంతో లారీ ల యాజమానులు, వ్యాపారులు ఇసుక దందాపై దృష్టిసారించారు. మన పరిధిలోని ఇసుక క్వారీలు మూ తపడడం తో సరిహద్దుపై వాలారు. దీంతో అధిక సంఖ్యలో లారీలు ఎస్గీ క్వారీకి క్యూ కట్టాయి. బోధన్ పట్టణ శివారు నుంచి ఎస్గీ క్వారీ వరకు సుమారు పది కిలోమీట ర్ల మేరకు రహదారి ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా మారింది.
డబ్బుల కోసం పడిగాపులు
ఎస్గీ ఇసుక క్వారీ సీజ్ కావడంతో ఇసుక కోసం వచ్చిన లారీలు సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. లారీల డ్రైవర్లు క్వారీ నిర్వాహకులకు ఇసుకకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే చెల్లిం చారు. ఒక్కొక్క లారీకి రూ. 13,500 వరకు చెల్లించామని వారు చెబుతున్నారు. క్వారీ సీజ్ కావడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో లారీల యాజమానులు, డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. క్వారీ నిర్వాహకులతో సంప్రదిం పులు కొనసాగించారు.
వారి నుంచి సంతృప్తికరంగా స మాధానం రాకపోవడంతో అయోమయంలో పడిపోయూ రు. క్వారీ మళ్లీ ప్రారంభమవుతుందని ఆందోళన చెందవద్దని నిర్వాహకులు అంటున్నారని, ఒక వేళ ప్రారంభం కాకపోతే డబ్బులు వాపస్ ఇస్తామంటున్నారని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. చెక్‌పోస్టు సమీపంలో అధిక సంఖ్యలో లారీలు నిలిచిపోయినా మన జిల్లా అధికార యంత్రాంగం వాటిని తొలగించే చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మొత్తానికి మహారాష్ర్ట అధికారులు మంజీరా నది తీరాన కలవరం సృష్టించారు.
మాఫియూకు ఝలక్
Published Wed, Mar 4 2015 3:34 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement