అటవీ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి అన్నారు.
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అటవీ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి అన్నారు. శుక్రవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మృగవని జాతీయపార్కు భూములకు సంబంధించిన రికార్డులను జేసీ పరిశీలించారు. అటవీశాఖ ఆధీనంలో ఉన్న మృగవని జాతీయ పార్కు భూములు కబ్జాకు గురవుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆ భూముల వివరాలను తెలుసుకునేందుకు ఆమె శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు.
మండలంలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 1,417 ఎకరాల 15 గుంటల భూమి అటవీశాఖ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భూమికి సంబంధించి శనివారం నుంచి పూర్తిగా సర్వేచేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఆమె వెంట డీఎఫ్‌ఓ మోహన్, ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ పీఎల్.గంగాధర్, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అంబర్‌సింగ్, ఎఫ్‌ఆర్‌ఓ నజీబుద్దీన్‌లు ఉన్నారు.