‘జూరాల’.. నీరెలా? | jurala project become leakage | Sakshi
Sakshi News home page

‘జూరాల’.. నీరెలా?

Published Mon, Jun 23 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

‘జూరాల’.. నీరెలా?

‘జూరాల’.. నీరెలా?

గద్వాల : గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 184 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జూరాల భారీ తాగునీటి పథకం అడుగడుగునా లీకేజీలమయంగా మారింది. ట్రయల్న్‌న్రు దాటి పనులు ముందుకు సాగ డం లేదు. దీంతో పాతపైపుల స్థానంలో కొ త్త పైపులు వేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఉ న్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులతో సర్వే చేయించారు. పైప్‌లైన్ల మార్పునకు రూ.85కోట్లు అవసరమవుతుందని అంచనావేసి ప్రభుత్వానికి నివేదించారు. జూరా ల రిజర్వాయర్ నుంచి డివిజన్‌లోని ప్రతీ గ్రామానికి తాగునీళ్లను అందించాలనేల క్ష్యంతో వైఎస్ ప్రభుత్వం 2005లో దాదాపు రూ.110 కోట్ల అం చనావ్యయంతో చేపట్టిన ఈ భారీతాగునీటి పథకానికి రూ.35కోట్లు కేటాయించింది. ఈ పథకం కేవలం రెండేళ్లలో పూర్తయి ప్రజల దాహార్తిని తీర్చాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించడంలో ఆలస్యం చేసింది. రెండేళ్ల తర్వాత పనులను ప్రారంభించగా, మొద టి విడత నిధులు సరిపోక అదనపు ని ధుల కోసం పనులు మళ్లీ ఆగాయి. 2012 ఆగస్టులో పనులు పూర్తిచేసి ఫిల్టర్‌బెడ్స్ నుంచి మొదటిదశలో కొండగట్టు వరకు ట్రయల్‌ర న్ నిర్వహించారు. చివరికి ప్రధానలైన్ అ డుగడుగునా లీకేజీలు ఏర్పడటంతో ఈ ప థకాన్ని ప్రారంభించకుండానే వాయిదా వేశాయి.
 
 నిధులిస్తేనే నీళ్లు!
 ప్రధాన పంపుహౌస్ నుంచి 4.5 కి.మీ దూ రంలో ఉన్న కొండగట్టుపై నిర్మించిన ట్యాంకు వరకు లీకేజీలమయమైన పైపుల ను తొలగించి వాటిస్థానంలో డీఐ పైపుల ను ఏర్పాటుచేశారు. దీంతో సమస్య పరిష్కారమైందని కొండగట్టు నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్‌లో నీటి విడుదలను 2013 ఆగస్టులో ప్రారంభించగా మళ్లీ లీకేజీలు మొదలయ్యాయి. పైప్‌లైన్ల సామర్థ్యాన్ని తనిఖీచేసి అవసరమైన చోట పై పులను మార్చాలని అధికారులు నిర్ణయించారు. గత రెండురోజుల పైప్‌లైన్ల లో నీటి ఒత్తిడిని పరిశీలిస్తున్నారు. మొదటిదశలో 31 గ్రామాలకు తాగునీటిని అం దించాలని చేసిన ప్రయత్నాలు లీకేజీలతో నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ టెస్ట్న్‌ల్రు నిర్వహించకుండానే పనులను వదిలేశా రు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు లీకేజీలకు కారణమైన పైపులను తొలగించి కొత్తలైన్లకు సర్వే చేయించారు.
 
 184 గ్రామాలకు తాగునీళ్లను అందించే పథకం సిద్ధమై పైప్‌లైన్ల కారణంగా నిలి చిపోయి.. వృథాగా మారిన విషయాన్ని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రి కే. తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఇంతటి భారీ పథకానికి పైప్‌లైన్లను మా ర్చి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అం దించేందుకు మంత్రి సుముఖత వ్యక్తంచేసినట్లు మాజీ ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. దీంతో ఇప్పటికే పైప్‌లైన్లు వే యడానికి ఖర్చయిన దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్లు మట్టిపాలైనట్లయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement