అమలు చేయకపోవడమే అసలు సమస్య | Justice Swatthar Kumar is environmental protection law | Sakshi
Sakshi News home page

అమలు చేయకపోవడమే అసలు సమస్య

Published Tue, Jun 6 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

అమలు చేయకపోవడమే అసలు సమస్య

అమలు చేయకపోవడమే అసలు సమస్య

పర్యావరణ పరిరక్షణ చట్టాలపై జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌
హైదరాబాద్‌లో ఎన్జీటీ బెంచ్‌ ఏర్పాటుకు సుముఖమేనని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పర్యావరణ పరి రక్షణకు అవసరమైన చట్టాలున్నా వాటిని సరిగా అమలు చేయకపోవడమే అసలైన సమస్యని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చైర్మన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యే కంగా మూడు అధికరణలు ఉన్నాయని చెప్పా రు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌–సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం ఆధ్వర్యంలో నిర్వహిం చిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కొన్నేళ్ల కింద ఏసీ సిటీగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం ఏసీలు తప్ప మరేమి లేవన్నారు.  

హైదరాబాద్‌లో బెంచ్‌కు సుముఖమే..
పర్యావరణ సంబంధ కేసులపై చెన్నైలోని బెంచ్‌కు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడు కుందని, హైదరాబాద్‌లో బెంచ్‌ ఏర్పాటు చేస్తే త్వరగా పరిష్కరించే వీలుందని పర్యావరణ వేత్త ప్రొ.కె.పురుషోత్తంరెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ట్రిబ్యునల్‌ బెంచ్‌ ఏర్పా టుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై నిర్ణయించాల్సింది ప్రభుత్వమేనని జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌ అన్నారు. యమునా నది ప్రక్షాళన, ఫ్రాన్స్‌కు చెందిన ఓడ ద్వారా ఇక్కడి సముద్రజలాలను కాలుష్యం బారిన పడకుండా చేయడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా కట్టడి, వాయుకాలుష్యం నియంత్రణకు చర్యలు వంటివి ఎన్జీటీ సాధిం చిన విజయాలని చెప్పారు.

 ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ.కె.సీతారామారావు మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైదొలగడం దురదృష్టకరమన్నారు. దీనిపై అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంద న్నారు. పశ్చిమ కనుమల సంరక్షణతో సమానంగా తూర్పు కనుముల పరిరక్షణకు కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆరు రాష్ట్రాలు, 1700 కి.మీ పరిధిలో ఉన్న తూర్పు కనుమల పరిరక్షణపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ఎంపీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అబ్దుల్‌కలాం స్మృత్యర్థం 500 పాఠశాలల్లో కలాం స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నట్లు కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి చెప్పారు.

 కలాం జయంతి రోజైన జూలై 27న మొక్కలను ఇచ్చే రోజుగా నిర్వహిస్తున్నట్లు   తెలిపారు. సదస్సు ముగింపు సందర్భంగా సభికులు, పెద్ద సంఖ్యలో వచ్చిన స్కూలు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ బార్‌కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, నేషనల్‌ అకాడమి ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.భిక్షపతి, ఓపెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మధుసూదనరెడ్డి, వైఎస్‌ కిరణ్మయి, నారా యణరావు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడినప్పుడే...
పర్యావరణాన్ని కాపాడి పచ్చదనాన్ని పెంచినప్పుడే మనుషులు సహా అన్ని జీవుల మనుగడ సాధ్యమవుతుందని జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌ అన్నారు. ప్రజల్లో పర్యావరణం, వాటి చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయవాదుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement