అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కె.లక్ష్మణ్‌ | k Laxman nominated as Assistant Solicitor General | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కె.లక్ష్మణ్‌

Published Sun, Aug 27 2017 2:24 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కె.లక్ష్మణ్‌

అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టులో కొత్త అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా కె.లక్ష్మణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారు. శుక్రవారం వరకు ఏఎస్‌జీగా ఉన్న బి.నారాయణరెడ్డి స్థానంలో లక్ష్మణ్‌ నియమితులయ్యారు.

మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ  అయ్యేంత వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు. లక్ష్మణ్‌ స్వస్థలం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామం. ప్రస్తుతం ఆయన న్యాయవాద పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement