Assistant Solicitor General
-
ఈడీది బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుబట్టడం పరిపాటే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరును కేంద్ర ప్రభుత్వమే తప్పుబట్టిన అసాధారణ ఘటనకు సాక్షాత్తూ సుప్రీంకోర్టే వేదికైంది! ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్‌పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సరీ్వసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణకు వచి్చంది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశమంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ‘‘ఈడీ జవాబుదారీతనంపైనే ఈ ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నివిధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)దే కదా’’ అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ను బాధ్యున్ని చేయలేమని ఏఎస్జీ బదులివ్వడంతో అయిష్టంగానే విచారణను చేపట్టింది. కానీ ‘‘దీన్ని మేమింతటితో వదిలేయదలచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌తో మీకేమీ సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?’’ అని ఏఎస్జీని ప్రశ్నించింది. దాంతో అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్‌ను ఓసారి సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. ‘‘ఇది కేవలం సమాచార లోపమే. అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సిందిగా ఈడీ డైరెక్టర్‌ను ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి’’ అని అభ్యరి్థంచారు. ధర్మాసనం మాత్రం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్‌కు ‘సుప్రీం’లో ఊరట -
అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో కొత్త అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా కె.లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తారు. శుక్రవారం వరకు ఏఎస్జీగా ఉన్న బి.నారాయణరెడ్డి స్థానంలో లక్ష్మణ్ నియమితులయ్యారు. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు. లక్ష్మణ్ స్వస్థలం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామం. ప్రస్తుతం ఆయన న్యాయవాద పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
మా నిర్ణయం తేలకుండానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తప్పిస్తూ జారీ అయిన నోటిఫికేషన్ వ్యవహారంలో కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పించే విషయంలో పరిపాలన పరంగా హైకోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా ఏపీఏటీ పరిధి నుంచి తప్పించాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్నీ నిలదీసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏపీఏటీలో అపరిష్కృతంగా ఉన్న దాదాపు 8,670 కేసుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.ఈ కేసుల గురించి స్పష్టత తీసుకోకుండానే లేఖ రాసిందే తడవుగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా ఓ ట్రిబ్యునల్ పరిధి నుంచి మరో రాష్ట్రాన్ని తప్పించినప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేసులను హైకోర్టుకు బదలాయించే విషయంలో అనుసరించిన విధానంపై తగిన అధ్యయనం చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని అటు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఇటు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.నారాయణరెడ్డిలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. -
నేనే ఏఎస్జీ.. కాదు నేనే!
హైకోర్టులో అశోక్‌గౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి వాదులాట సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) పోస్టు విషయం లో హైకోర్టులో న్యాయవాదులు పొన్నం అశోక్‌గౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి ల మధ్య మొదలైన కుమ్ములాట ఇప్పుడు కోర్టు విచారణ సమయం లో న్యాయమూర్తుల ముందు వాదులాట వరకు వచ్చింది. కొత్త ఏఎస్జీగా తాను నియమితులయ్యానని, తనకు ఆ బాధ్యతలు అప్పగించాలని విష్ణువర్దన్‌రెడ్డి వాదిస్తుంటే.. కాదు తనను తొలగిస్తున్నట్లు ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ తనకు అందలేదు కాబట్టి తానే ఏఎస్జీగా కొనసాగుతానని అశోక్‌గౌడ్ చెబుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు వారు ఇరువురూ లేచి నేను ఏఎస్జీనంటే.. కాదు నేనే ఏఎస్జీనంటూ వాదించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం ఏఎస్జీ బాధ్యత. మరికొందరు న్యాయవాదులు ఆయనకు సహాయకులుగా ఉంటారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోదరుడైన అశోక్‌గౌడ్ 2009లో ఏఎస్జీగా నియమితులయ్యారు. ఆయన ఆ పోస్టులో కొనసాగుతుండగానే విష్ణువర్దన్‌రెడ్డి 2012, సెప్టెంబర్‌లో ఏఎస్జీగా రెండేళ్ల కాల పరిమితితో కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అశోక్‌గౌడ్... ఏఎస్జీగా పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. హైకోర్టు విచారించే రోజువారీ కేసుల జాబితా (కాజ్ లిస్ట్)లో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యేందుకు అశోక్‌గౌడ్ పేరే మొన్నటి వరకూ ప్రచురితమయ్యేది. అయితే గత నెలలో అశోక్‌గౌడ్‌ను ఏఎస్జీ పదవి నుంచి రాష్ట్రపతి తొలగించారని, విష్ణువర్థన్రెడ్డే ఆ పదవిలో కొనసాగుతారని, కేసులన్నింటినీ ఆయనకే అప్పగించాలని అశోక్‌ను ఆదేశిస్తూ కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ ఆర్.ఎస్.శుక్లా పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అశోక్ మాత్రం ఆ ఉత్తర్వులు తనకు అందలేదంటూ ఏఎస్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విష్ణువర్థన్‌రెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కలసి... శుక్లా ఉత్తర్వులను చూపించి, తానే ఏఎస్జీనని, కాజ్‌లిస్ట్‌లో తన పేరే ముద్రించాలని కోరారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆ మార్పు చేశారు. మరోవైపు వారిద్దరూ ఒకరిపై ఒకరు న్యాయమూర్తులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దాఖలైన కేసులు గురువారం వివిధ కోర్టుల్లో విచారణకొచ్చిన సమయంలో ఏఎస్జీ పోస్టు విషయమై అటు విష్ణువర్థన్‌రెడ్డి, ఇటు అశోక్‌గౌడ్ తరఫున ఆయన సహాయక న్యాయవాదులు వాదులాడుకున్నారు.