సాక్షి, వరంగల్: తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 31 జిల్లాలలో దేన్ని రద్దు చేయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయనిక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాలను రద్దు చేయునున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా గ్రామాలు, సరిహద్దు విషయంలో సమస్యలు ఉంటే సర్దుబాటు చేస్తామన్నారు. మరోవైపు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ పై ప్రజా ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం లేదని.. ఈ సమస్య పరిష్కారానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment