'కాళేశ్వరం’ అనుమతులు అడ్డుకోవడంపై రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అడ్డు చెప్పడంపై కేంద్ర జలసంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరం వ్యక్తంచేసింది. గతంలో ఏ ఇతర ప్రాజెక్టు లకులేని ఆటంకాలు తమకు సృష్టించ డమేంటని కేంద్ర జలసంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. సోమవారం ఇదే అంశాన్ని తేల్చు కునేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ప్రాజెక్టు సీఈ హరిరామ్‌లు సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
పర్యావరణ అనుమతులకు, కేంద్ర జల సంఘం అనుమతులు తప్పనిసరికాదని, తమ ప్రాజెక్టుకే అభ్యంతరాలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం ఏమా త్రం అంగీకారం కాదని స్పష్టం చేశారు. అయితే దీనిపై ఎలాంటి హామీ ఇవ్వని కేంద్ర జలసంఘం అధికారులు, త్వరలో పరిశీలించి ఎలాంటి నిర్ణయాన్నైనా వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.