కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో కామారెడ్డి ఆస్పత్రికి ప్రథమ స్థానం దక్కడం గమనార్హం. ఏరియా ఆస్పత్రుల విభాగంలో బాన్సువాడ ద్వితీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ పీహెచ్‌సీగా భిక్కనూరు, ఉత్తమ అర్బన్ సెంటర్‌గా రాజీవ్‌నగర్ కాలనీ సెంటర్ ఎంపికయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కాయకల్ప అవార్డులను ప్రకటించింది. రెండో తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ అవార్డులను అందించనున్నారు. కామారెడ్డి ఆసుపత్రికి అవార్డుతో పాటు రూ. 50 లక్షలను అందిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ కాయకల్ప అవార్డులకోసం రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలకు మార్కులు ఇ చ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి 89.80 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. 82.80శాతం మార్కులతో సంగారెడ్డి, కొం డాపూర్ జిల్లా ఆస్పత్రులు రెండో స్థానంలో నిలిచాయి.
ఏరియా ఆస్పత్రుల్లో..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులలో 92.80 శాతం మార్కులతో భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రథమ స్థానంలో నిలి చింది. ఈ విభాగంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ఏరి యా ఆస్పత్రి 89.30 శాతం మార్కులతో ద్వితీ య స్థానం పొందింది.
ఉత్తమ పీహెచ్‌సీగా..
రాష్ట్రంలో ఉత్తమ సేవలందిస్తున్న పీహెచ్ సీలకు సైతం అవార్డులను ప్రకటించారు. ఈ విభాగం లో 96 శాతం మార్కులతో భిక్కనూరు పీహెచ్ సీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్బ న్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల విభాగంలో 87.50 శాతం మార్కులతో కామారెడ్డి రాజీవ్‌నగర్ కాల నీ అర్బన్ సెంటర్ ప్రథమ స్థానం పొందింది.
రేపు అవార్డుల అందజేత
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కాయకల్ప అవార్డులను ప్రదానం చేయనున్నారు.
సమష్టి కృషితో అవార్డు..
కాయకల్పలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి రాష్ట్రంలో ప్రథమ స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంది. మా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఈ అవార్డు వచ్చింది. ఈ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలను అందిస్తాం. ఆస్పత్రి అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. – అజయ్‌కుమార్, డీసీహెచ్‌ఎస్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment