సుల్తానాబాద్ (కరీంనగర్) : జీవనోపాధి కోసం కరీంనగర్ జిల్లా నుంచి నేపాల్‌కు వలస వెళ్లిన వారి యోగక్షేమాలపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి నేపాల్‌కు ఏటా 1500 మంది వలస వెళ్తుంటారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, లింగాపూర్, గోపాల్ రావుపేట్, మారేడుపల్లి తదితర గ్రామాల నుంచి ఉపాధి కోసం అక్కడికి వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం మండలానికి చెందిన దాదాపు 1500 మంది అక్కడ ఉన్నారు. శనివారం ఆ దేశంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. కనీస సమాచారం తెలుసుకునేందుకు సాధ్యం కావటం లేదని, వారి ఫోన్లు పనిచేయటం లేదని ఇక్కడి వారు చెబుతున్నారు.