
'బోవెరా' నేటి తరాలకు ఆదర్శప్రాయుడు
కరీంనగర్ : బోయిన్‌పల్లి వెంకటరామారావు నేటి తరాలకు ఆదర్శప్రాయుడని మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది బోయిన్‌పల్లి వెంకట రామారావు(బోవెరా) భార్య యశోదాదేవి పేరిట నెలకొల్పిన అవార్డు ప్రదానోత్సవంలో తుషార్‌గాంధీ పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం కరీంనగర్‌లోని బోవెరా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యశోదాదేవి మెమోరియల్ అవార్డును కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమకు ఆయన అందజేశారు. ప్రజాప్రతినిధిగా తుల ఉమ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.