Tula Uma
-
బీసీని బీజేపీ సీఎం చేయడం ఒక కల: తుల ఉమ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తుల ఉమ తన ముఖ్య అనుచరులతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కండువా కప్పి ఉమను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో గతంలో కంటే ఉమకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ మీడియా సమక్షంలో హామీ ఇవ్వగా.. టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చిన బీజేపీపై ఉమ విమర్శలతో విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ ఉమక్కను(తుల ఉమను ఉద్దేశించి..) అవమానించింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ నేతగా, నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఉమక్క పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా.. బీఆర్ఎస్ ఇంటిబిడ్డగా సేవలందించిన ఉమక్కకు బీజేపీలో ఇటువంటి అవమానం జరగడం బాధగా ఉంది. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నాం. .. అందుకే ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ స్వయంగా సూచించారు. ఆయన సూచన మేరకు ఇవాళ ఆహ్వానం పలుకుతున్నాం. మా ఇంటి ఆడబిడ్డగా మా ఆహ్వానం మన్నించి రావడం సంతోషం. గతంలో వున్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను ఉమక్కకు అప్పగిస్తాం. సముచితంగా గౌరవించుకుంటాం. ఇందుకు సంబంధించిన బాధ్యతను నేనే స్వయంగా తీసుకుంటా. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఉమక్క సేవలు అవసరం. తుల ఉమక్కకు పుట్టిన గూటికి పునః స్వాగతం’’ అని అన్నారు. తుల ఉమా మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారు. బీజేపీలో బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే. అందుకు ఉదాహరణ నేనే. నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి. బీజేపీ కేవలం అగ్రవర్ణాల పార్టీ. కింది స్థాయి కార్యకర్తలను కేవలం వాడుకుంటుంది. గతంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో ఉన్నప్పుడు అనేక హోదాల్లో పని చేశా. కానీ, బీజేపీలో అలాంటి గౌరవం ఏమీ దక్కలేదు. ఇప్పుడు నా సొంత గూటికి వచ్చినట్లు ఉంది. సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో పార్టీ కోసం పని చేస్తాం. బీజేపీ కార్యకర్తల్లారా.. ఆగం కాకండి. పార్టీ మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది. ఆ విషయం గుర్తించండి’’ అని అన్నారామె. -
బీజేపీకి తుల ఉమ రాజీనామా
-
Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్
సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. తుల ఉమకు షాక్.. వికాస్ రావుకే బీఫామ్ వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీ-ఫామ్ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్‌పాండేకు కాకుండా పులిమామిడి రాజుకు బీ-ఫామ్ అందజేసింది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
Vemulawada: వికాస్ రావుకు కాకుండా తుల ఉమాకు టికెట్ ఎలా ఇస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వేములవాడ టికెట్ కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు కాకుండా, తుల ఉమకు ఎలా ఇస్తారని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కచ్చితంగా బీజేపి టికెట్ వికాస్ రావుకి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో యువకుడికి స్వల్ప గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. అయితే వేములవాడ బీజేపీ టికెట్ వికాస్‌కు ఇచ్చే వరకు వెళ్ళేది లేదని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. వికాస్‌రావు మద్దతుదారులతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు. కాగా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగో విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను బీజేపీ విడుదల చేసింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను బుధవారం ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
Etela Rajender: ఈటలతో పాటే తుల ఉమ రాజీనామా?!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఊహించినదే జరిగింది. నెలరోజుల ఉత్కంఠకు ముగింపు లభించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో 19 సంవత్సరాల పాటు టీఆర్ఎస్తో ఉన్న అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే బీజేపీలో చేరాలనే నిబంధన మేరకే ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించనున్నారు. ఈ వారం రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు మంచిరోజులు లేకపోవడంతో బీజేపీలో చేరిక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఈటల వర్గాల ద్వారా తెలిసింది. ఈటల రాజీనామా ఆమోదం పొందితే మరోసారి హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. పార్టీ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగి.. తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ స్థాపించిన తరువాత 2002లో ఈటల రాజేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్లో చేరిన కొద్దిమంది ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించిన ఈటలను కేసీఆర్ ప్రోత్సహించారు. అందులో భాగంగానే సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయనకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు. కేసీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, బీసీ నాయకుడిగా గొంతెత్తడం ఉత్తర తెలంగాణలో ఆయన కీలక నేతగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వర్తించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. నాటి నుంచి వెనుదిరిగి చూడని ఈటల 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009లో శాసనసభ స్థానాల పునర్విభజనలో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2010లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా 2014 వరకు కొనసాగారు. 2014లో రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ కేబినెట్లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యేగానే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత జరిగిన పరిణామాలతో నెలరోజుల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్తారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలం నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా స్థానిక నాయకులు శుక్రవారం శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. కాగా.. ఈటల టీఆర్ఎస్కి రాజీనామా చేసి హుజూరాబాద్‌కు రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో మాజీ మంత్రిపై ముప్పేట దాడికి టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 11, 12 తేదీల్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ తదితర ముఖ్య నాయకులతో హుజూరాబాద్‌లో పర్యటన ఖరారైంది. మొత్తంగా మండలాల్లో ఈటలకు మద్దతుగా ని లిచిన పార్టీ కేడర్‌ను కూడా ఆయనకు దూరం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈటల రాజీ నామా ప్రకటన తరువాత ఆయన సొంత మండలం కమలాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకోవడం, కేసీఆర్ ఫొటో కు క్షీరాభిషేకం చేయడం వంటి చర్యలు గులాబీ పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేస్తోంది. ఈటల రాజీనామాతో రాజకీయం మరింత వేడెక్కింది. ముప్పేట దాడికి టీఆర్ఎస్ ప్రణాళిక మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్చార్జిగా నియమించింది. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవ్వరూ ఆయన వెంట వెళ్లకుండా ‘కట్టుదిట్టమైన’ ఏర్పాట్లు చేయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈటల వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమతోపాటు హుజూరాబాద్‌కు చెందిన కొందరు నాయకులు మినహా ఎవరూ వెళ్లలేదు. ప్రజాబలం తనకు ఉందని చెపుతున్న ఈటలను ప్రజాప్రతినిధులను కట్టడి చేయడంతో ఇరుకున పెట్టి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్ -
కమలం గూటికి ఉమ..?
సాక్షి, జగిత్యాల: జిల్లా పరిషత్ చైర్పర్సన్.. మేడిపల్లి మండలం మోత్కురావుపేట ఆడబిడ్డ తుల ఉమ త్వరలోనే కమలం గూటికి చేరునున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఖరారైతే ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనతో ఆమె ఉన్నారా..? ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. వేములవాడ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ.. ఈనెల 24న ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు ఆధ్వర్యంలో తన పుట్టినిల్లయిన మేడిపల్లిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు డుమ్మా కొట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొదట్నుంచే రమేశ్‌బాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉమ.. ఆశీర్వాద సభకు హాజరైతే ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్టే అని అందరూ భావించారు. కానీ ఆమె సభలో పాల్గొనకపోవడం.. మరుసటి రోజే అక్కడే తన క్యాడర్‌తో సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే బరిలో ఉండాల్సిందేనంటూ ఉమపై ఆమె క్యాడర్ తీవ్రఒత్తిడి తీసుకురావడంతో ఆమె బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనే విషయంపై ఉమ తన క్యాడర్‌కు స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క రమేశ్‌బాబు జర్మనీ పౌరసత్వం కేసుకు సంబంధించి ఈనెల 26న కోర్టులో విచారణ ఉంది. ఇందులో ఏ తీర్పు వస్తుందో వేచిచూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలనే ఆశతో ఉమా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తీర్పు రమేశ్‌బాబుకు అనుకూలంగా వస్తే బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రతికూల తీర్పు వస్తే.. వేములవాడ టికెట్ తనకే వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఉమ వైపు బీజేపీ చూపు..? ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బీజేపీ కొన్నిరోజుల క్రితం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో వేములవాడ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఉమపై పార్టీ ఆరా తీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్న.. సున్నిత మనస్కురాలిగా పేరొందిన తుల ఉమకు వేములవాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో హైదరాబాద్‌లో కలవడం అప్పట్లో చర్చకు దారి తీసింది. తాజాగా బీజేపీ జాతీయ నాయకులు ఉమతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీనే నమ్ముకుని ఉన్న ప్రతాపరామకృష్ణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రతాప రామకృష్ణను కాదని ఉమకు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని బీజేపీ నేతలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచే.. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే తుల ఉమ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పట్నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న ఆమె 2014 ఎన్నికలతోపాటు ఈసారీ తన నియోజకవర్గమైన వేములవాడ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీనికి తోడు వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, తుల ఉమల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న పోరు తారస్థాయికి చేరుకుంది. ఈక్రమంలోనే ఆమె ఉమ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు రమేశ్‌బాబు, తుల ఉమకు చెందిన రెండువర్గాలుగా చీలిపోయారు. కొన్నాళ్ల నుంచి ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం తుల ఉమకు మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో బాగా పట్టు ఉంది. ఇటు వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాల్లోనూ కొంత క్యాడర్ ఉంది. కేసీఆర్‌నే నమ్ముకుని ఉన్న: తుల ఉమ టీఆర్ఎస్ ఏర్పాటు రోజు నుంచే నేను మా పార్టీ అధినేత కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్న. వేములవాడ టికెట్ నాకే వస్తుందనే నమ్మకం ఉంది. మంత్రులు ఈటల, కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికైతే టీఆర్ఎస్ను వీడే ఆలోచన లేదు. హైదరాబాద్‌లోని మా బంధువు ఇంటికి వెళ్లగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యాదృచ్ఛికంగా కలిశారు. -
జెడ్పీ ఛైర్మన్ తుల ఉమకు ప్రమోషన్..!
-
అధికారులు తీరు మార్చుకోవాలి...
భూమి కొనుగోలుపై ఇంత నిర్లక్ష్యమా? ట్యాంకర్ల బిల్లులు చెల్లించాలి స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.సర్వర్‌పాషా, సారంగాపూర్ జెడ్పీటీసీ భూక్య సరళ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాపరిషత్ సమావేశమందిరంలో చైర్పర్సన్ తుల ఉమ, సీఈవో సూరజ్‌కుమార్ ఆధ్వర్యంలో 6వ స్థాయీ సంఘ(సాంఘిక సంక్షేమ) సమావేశం చైర్మన్ గజ్జెల వసంత అధ్యక్షతన గురువారం జరిగింది. గ్రామాల్లో భూకొనుగోలు పథకంపై ప్రచారం చేపట్టకపోవడంతోనే భూములు ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని ఆరోపించారు. సాంఘికసంక్షేమ వెనుకబడిన వసతిగహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు శ్రద్ధచూపాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో వివరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, తీరు మార్చుకోవాలని సూచించారు. –గ్రామీణాభివద్ధి సంఘ సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలోద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేసిన తరువాత ఈఎండీ బకాయిలు చెల్లించడంలేదన్నారు. గ్రామాల్లో అనర్హుల పేరిట ఆహారభద్రత కార్డులను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని జెడ్పీటీసీలు వీరమల్ల చంద్రయ్య, ఆకుల శ్రీలత, ప్రీతి రఘువీర్‌సింగ్, గంట అక్షిత తెలిపారు. –వేసవిలో గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించేందుకు లీజుకు తీసుకున్న అద్దె బావులు, ట్యాంకర్ల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని సభ్యులు ఇప్పనపల్లి సాంబయ్య, ఎడ్ల సుగుణాకర్, కె.లచ్చిరెడ్డి, అరుకాల వీరేశలింగం, పి.సంజీవరెడ్డి తెలిపారు. – కాల్వశ్రీరాంపూర్ జెడ్పీటీసీ లంక సదయ్య మాట్లాడుతూ మీర్జాంపేట, కొత్తపల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఫ్లోరైడ్ వాటర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. – ఎస్సారెస్పీ కెనాల్ పనుల్లో నాణ్యత లోపిస్తోందని సైదాపూర్, శంకరపట్నం జెడ్పీటీసీలు వెంకటరెడ్డి, సంజీవరెడ్డి చెప్పారు. వరదకాలువ తూములు ఏర్పాటుచేయాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత అన్నారు. జవాబుదారీగా ఉండండి –తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందిస్తూ జవాబుదారీగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సూచించారు. సమావేశాల్లో ఆయా శాఖల ప్రగతి నివేదికలను రూపొందించి బుక్లెట్ రూపేణ పంపిణీ చేయాలన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మందులు, వైద్యులు అందుబాటులో ఉండాలి జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో తుల ఉమ నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలన్న జీవన్‌రెడ్డి కరీంనగర్ సిటీ : సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు స్థానికంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. విద్య, వైద్యంపై జెడ్పీ స్థాÄæూ సంఘం సమావేశాలు బుధవారం జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహించారు. అధ్యక్షత వహించిన తుల ఉమ మాట్లాడుతూ... వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, రోగులను మందులను బయట కొనుక్కోమంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్న వైద్యులు వారిని సొంత ఆస్పత్రులకు రమ్మంటూ వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి సెలవులు పెట్టకుండా రోగులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. క్యాన్సర్, కిడ్నీ, గుండెసంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం పెచ్చులూడి రోగులు గాయపడిన సంఘటనలు పునరావతం కానీయరాదన్నారు. అలాంటి సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని, మరమ్మతులు చేయిస్తామని అన్నారు. జ్వరాలొస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయే పరిస్థితే ఉండొద్దన్నారు. ఏఎన్ఎంల నియామకంలో వయోపరిమితి పాటించాలన్నారు. – మూడు వందల మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. వందశాతం అక్షరాస్యత సాధించేలా సంబంధిత అధికారులు ఇప్పటినుంచే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. – జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. అక్కన్నపేటతోపాటు తొమ్మిది పీహెచ్‌సీలను ప్రారంభించాలన్నారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇరవై మండలాల్లో వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్నారు. కనీసం ఈ సీజన్లోనైనా అందుబాటులో ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. కోహెడ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తమ మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలని కోరారు. నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలి ఎస్సారెస్పీ నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సూచించారు. ఉదయం జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ స్థాÄæూ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీటి విడుదల షెడ్యూల్ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రైతులు నార్లు వేసుకొంటారన్నారు. రుణమాఫీకి, రుణ మంజూరుకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు ఈ రెండింటికి ముడిపెడుతున్నారని అన్నారు. రుణాల మంజూరుపై ఈసారి బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రైతుల పెట్టుబడికి ఉపయోగపడాలని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా జిల్లాకు రావాల్సిన రూ.36 కోట్లు రాలేదన్నారు. 2014లో నష్టపోయిన రైతులకు హార్టికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ రూ.6 కోట్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటతో ఎరువుల అంచనాలు తలకిందులవుతాయని, పెరిగిన డిమాండ్ మేరకు అధికారులు ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. రోళ్లవాగును డీ–53 ద్వారా నింపితే సారంగాపూర్, ధర్మపురి ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయికల్ తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన మామిడితోటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు గడువు ముగిసినా బ్యాంకర్లు రైతుల నుంచి ప్రీమియం వసూలు చేస్తున్నారన్నారు. అలాంటిదేమీ లేదని జేడీఏ చెప్పడంతో జీవన్‌రెడ్డి లీడ్‌బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశంపై మంత్రితో చర్చిస్తామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ హామీ ఇచ్చారు. – మల్హర్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భూసార పరీక్షలు చేసినా రిపోర్టులు ఇవ్వడం లేదన్నారు. ల్యాబ్‌లో సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది ఉందని జేడీఏ సమాధానం చెప్పడంతో.. ఎజెండాలో చేసినట్లు ఎందుకు చూపించారని ఆయన నిలదీశారు. మాచారంలో 16 మందికి డ్రిప్ ఏర్పాటు చేయలేదన్నారు. తమ ప్రాంతంలో రైతులు మిర్చి పంటను అధికంగా పండిస్తున్నారని, వారికి మార్కెటింVŠ సౌకర్యం కల్పించాలని కోరారు. యంత్రాలతో ఆరపెడితే 24 గంటల్లో విక్రయించుకోవచ్చని, లేదంటే 12 నుంచి 14 రోజుల సమయం పడుతుందన్నారు. – వ్యవసాయం చేయని పట్టా భూములను సర్వే చేసి వాటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధికారులకు సూచించారు. – సాయంత్రం స్త్రీ శిశు సంక్షేమ స్థాÄæూ సంఘం సమావేశం కమిటీ చైర్పర్సన్ కందుల సంద్యారాణి అధ్యక్షతన జరిగింది. జెడ్పీటీసీ శోభ మాట్లాడుతూ కందిపప్పు నాణ్యత లేదని, కోడిగుడ్లు చిన్నవిగా ఉంటున్నాయని, గ్యాస్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిల్లలు రావడం లేదన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురున్న కేంద్రాలను మూసివేయాలన్నారు. బాలసంరక్షణా కేంద్రాలు, అనాథాశ్రమాలకు అనుమతుల్లో నిబంధనలు అమలు చేయాలన్నారు. – ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా, సభ్యులు రాకపోవడంతో కోరం లేక ఎదురుచూడాల్సి వచ్చింది. 11 గంటలకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాగా, మరో 12 నిమిషాలకు ఇద్దరు సభ్యులు రావడంతో సమావేశాన్ని ప్రారంభించారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌కు స్వాగతం
కరీంనగర్‌సిటీ : ఆట ఆహ్వానం మేరకు ఆమెరికాలో పర్యటించి స్వదేశానికి తిరిగి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమరాజేందర్‌రావు దంపతులకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న చైర్‌పర్సన్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, శేఖర్, ఎంపీపీ అయిలయ్య, తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. -
'బోవెరా' నేటి తరాలకు ఆదర్శప్రాయుడు
కరీంనగర్ : బోయిన్పల్లి వెంకటరామారావు నేటి తరాలకు ఆదర్శప్రాయుడని మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది బోయిన్పల్లి వెంకట రామారావు(బోవెరా) భార్య యశోదాదేవి పేరిట నెలకొల్పిన అవార్డు ప్రదానోత్సవంలో తుషార్‌గాంధీ పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం కరీంనగర్‌లోని బోవెరా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో యశోదాదేవి మెమోరియల్ అవార్డును కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు ఆయన అందజేశారు. ప్రజాప్రతినిధిగా తుల ఉమ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. -
జడ్సీ చైర్‌పర్సన్‌కు తప్పిన ప్రమాదం
సిద్దిపేట(మెదక్ జిల్లా): కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు తృటిలో ప్రమాదం తప్పింది. రాజధానిలో జరిగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు తుల ఉమ మంగళవారం వెళుతున్నారు. సిద్దిపేట సమీపంలో కొండపాక మండలం దుద్దెడ సమీపంలో రెండు కార్లు ఢీ కొని, ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వం నూతనంగా కేటాయించిన ఇన్నోవా వాహనంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సల్పగాయాలతో ఆమె భయటపడ్డారు. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న గన్‌మేన్, అటెండర్, డ్రైవర్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. -
టీడీపీ నాయకులు మతిస్థిమితం కోల్పోతున్నారు
రాయికల్ :రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మతిస్థిమితం కోల్పోతున్నారని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. రాయికల్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేఖి అయిన ఆంధ్రా సీఎం చంద్రబాబుతో కలిసి తెలంగాణలో సభలు నిర్వహించడం తెలంగాణ తమ్ముళ్లకు సిగ్గుగా లేద అన్నారు. రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు ఆరోపణలు మానకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సర్పంచులు జయ, రాజన్న, వ్యాపారి అనంతుల మల్లేశం, చౌడారపు లక్ష్మీనారాయణ టీఆర్ఎస్లో చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి సంజయ్‌కుమార్, నాయకులు రమాదేవి, హన్మాండ్లు, శ్యాసుందర్‌రావు, అనిల్ పాల్గొన్నారు. -
'పార్టీ సభ్యత్వంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి'
కరీంనగర్ : పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆ జిల్లా జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. అందులోభాగంగా వివిధ జిల్లాలో ఇప్పటికే ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
వీఐపీ రిపోర్టర్ : కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ ఉమ
-
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : విద్యతోనే అభివృద్ధి సాధ్యమని.. అందరికి విద్యనందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. 48వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాస్యత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వుుఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిరక్షరాస్యతతో అభివృద్ధికి ఆటంకమన్నారు. గ్రామీణ మహిళలు అక్షరాస్యతలో వెనుకబడ్డారని.. విద్య ఆవశ్యకత తెలుసుకోవాలని సూచించారు. ఆమేరకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యత సాధన సామాజిక బాధ్యత అని అన్నారు. జిల్లాలో అక్షరాస్యత 64.87 శాతం కాగా పురుషుల అక్షరాస్యత శాతం 74.72 అని, స్త్రీ అక్షరాస్యత శాతం 55.18 ఉందని అన్నారు. జిల్లాలో 10,25,689 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి 3,09,537 మందిని అక్షరాస్యులుగా మార్చామని, మిగిలిన 7 లక్షలకుపైగా ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను కోరారు. అదనపు జాయింట్ కలె క్టర్ నంబయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం నేర్పించాలన్నారు. మెప్మా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ అక్షరాస్యతలో విజయనగరం జిల్లాను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సదానందం, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మోహిని అలియాస్.. ఉమక్క
► పదకొండేళ్లకే అడవిబాట ►జనశక్తి దళాల్లో పదమూడేళ్లు ►జనంలో బీడీ కార్మికుల నేత ►జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విప్లవమే ఆమెకు పేరు పెట్టింది. మాటలు నేర్పింది. పాటలు నేర్పింది. చదువు నేర్పింది. అజ్ఞాతంలో ఉన్నప్పుడే ఆమె ఏడడుగులు వేసింది. దళం దీవెనలతోనే పెళ్లి చేసుకుంది. నవమాసాలు మోసిన తన బిడ్డకు ఆ దళమే కాపలాగా పురుడుపోసింది. కల్లోలిత జిల్లాలో పోలీసుల కాఠిన్యాన్ని, లాకప్‌లో చిత్ర హింసలను, వరుస ఎన్కౌంటర్లను ఆమె కళ్లారా చూసింది. ప్రతక్ష్యంగా అనుభవించింది. ఎన్నోసార్లు పోలీసు దాడుల నుంచి త్రుటిలో తప్పించుకుంది. పదకొండేళ్ల వయస్సులో బతుకుదెరువుకు బీడీలు చుట్టింది. లోకం పోకడ తెలిసీ తెలియని తనంలోనే కన్నవాళ్లను, ఉన్న ఊరును వదిలింది. ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ.. కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మ...’ అంటూ జనశక్తి పోరుబాట నడిచింది. ఎందరినో తనవెంట నడిపించింది. పదమూడేళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపింది. ఆమె తుల ఉమ. అసలు పేరు మోహిని. బీడీ కార్మికులు, రైతుకూలీ పోరాటాలు, సారా ఉద్యమం, తెలంగాణ ఉద్యమంతో అందరికీ సుపరిచితమైన తుల ఉమకు టీఆర్ఎస్ రాజకీయ పునర్జన్మను ఇచ్చింది. అందివచ్చిన అవకాశాలతో జెడ్పీ చైర్పర్సన్ పదవిని అధిరోహించిన మోహిని అలియాస్ ఉమ లైఫ్‌స్టైల్ ఈవారం ‘సాక్షి’ సండేస్పెషల్. పార్టీ సహచరుడితో పెళ్లి 1985లో అజ్ఞాతంలోనే పెళ్లి చేసుకున్నా. మెట్పల్లి మండలం చెవులమద్దికి చెందిన రాజేందర్‌కుమార్ అప్పుడు జనశక్తిలో జగిత్యాల జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉండే. నాకు చదువు రాదు. ఆయనే నేర్పాడు. అన్నింటా తోడుగా ఉండేవాడు. పార్టీకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. గోదావరిఖని ఏరియాలో అప్పటి పార్టీ నేత చలపతిరావు సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లంటే.. దళం సమక్షంలో ఇద్దరం దండలు మార్చుకున్నాం. పోలీసులంటే భయం మాది మేడిపల్లి మండలంలో మారుమూల పల్లె మోత్కురావుపేట. మా ఊళ్లో బడి లేదు. పేద కుటుంబం. గొర్లు కాయటం.. బీడిలు చుట్టడం.. మేం ముగ్గురం. ఇద్దరు అక్కలు. నేనే చిన్నదాణ్ని. గోవిందారం దొరలంటే ఆ పల్లెల్లో హడల్. వాళ్లదే ఆధిపత్యం. అందమైన అమ్మాయిలు వాళ్ల కంట్లోబడితే పాపంగా ఉండేది. 1983.. నాకు పదకొండు పన్నెండేళ్ల వయస్సు. మా పల్లెకు చాటుమాటుగా నక్సలైట్లు వచ్చేటోళ్లు.. అన్నలను వెతుక్కుంటూ పోలీసోళ్లు వచ్చేటోళ్లు. ఎవరన్నా అన్నలకు తిండి పెట్టినట్లు తెలిస్తే... చిత్రహింసలు పెట్టేటోళ్లు. పోలీసులంటే టై. బూట్ల చప్పుడు వింటేనే అప్పుడు నాకు వణుకు పుట్టేది. నిర్బంధం నీడలో పురుడు 1986లో బాబు పుట్టాడు. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కార్ఖానగడ్డలో ఓ ఇంట్లో తలదాచుకున్నా. బాబు పుట్టగానే.. వారం రోజుల పాటు చలపతిరావు భార్య నాతో ఉంది. మేమున్న సమాచారం పోలీసులకు లీకైనట్లు తెలిసింది. రాత్రికి రాత్రే పసిబిడ్డతో నిజామాబాద్‌కు వెళ్లిపోయా. మరుసటి రోజే షెల్టర్ తీసుకున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి.. తాళం వేశారు. నాలుగు నెలల తర్వాత బాబును అత్తామామలకు అప్పగించా. నందిపేట, నవీపేట ఏరియాలో మళ్లీ బీడీ కార్మికులను సంఘటితం చేసేందుకు సెమీ లీగల్‌గా పని చేశా. అప్పుడే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమ అని పేరు పెట్టాడు. అప్పట్నుంచీ సగం అజ్ఞాతం.. సగం జనజీవనం. అత్తామామలపైనే పోరు 1987లో మెట్పల్లిలో శ్రామిక శక్తి బీడీ వర్కర్క్స్ యూనియన్ పేరుతో ఆఫీసు తెరిచా. మా అత్తామామలది భూస్వామ్య కుటుంబం. చెవులమద్దిలో ఉన్న భూములను పంపిణీ చేయాలని మెట్పల్లి రెవెన్యూ ఆఫీస్ ఎదుట ధర్నా చేసినా. వాళ్లే స్వచ్ఛందంగా 200 ఎకరాలు ప్రభుత్వానికి రాసిచ్చారు. ఊళ్లో పేదలకు పంపిణీ చేయటంతో.. ఇళ్లు కట్టుకున్నారు. దానికే ‘తుల నగర్’ అనే పేరు పెట్టుకున్నారు. ఎన్వీ కృష్ణయ్య సారథ్యంలో బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేశా. ప్రగతి శీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా. లాకప్‌లో 5 రోజులు దూబగుంట కంటే ముందే జగిత్యాలలో మద్యం తాగొద్దు.. దుకాణాలు ఎత్తేయండి.. అంటూ భారీ ర్యాలీ నిర్వహించినం. బీడీ కార్మికులు నెల రోజుల పాటు సమ్మె చేశారు. యాజమాన్యాలు దిగివచ్చాయి. సిరిసిల్ల ప్రాంతంలో జనశక్తి నేత జలపతి రెడ్డి ఎన్కౌంటర్లో చనిపోయాడు. వైజాగ్‌లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యాను. ఆ వేదికపై ఉండగానే.. జలపతిరెడ్డి ఎన్కౌంటర్ వార్త విని సృహ తప్పి పడిపోయాను. పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. చల్గల్లో బస్సులపై దాడి చేసి ఆపేసినం. పోలీసులకు దొరికినం. అసభ్యకరంగా మాట్లాడితే పోలీసులకు ఎదురుతిరిగినా. అయిదు రోజుల పాటు లాకప్‌లో నిర్బంధం. మోకాళ్లపై లాఠీ దెబ్బలు. ఇప్పటికీ ఆ దెబ్బలు బాధిస్తూనే ఉన్నాయి. అప్పుడు నేను జనశక్తి జిల్లా కమిటీ సభ్యురాలిని. ఎల్ఎల్బీ చేయలేకపోయా కరీంనగర్ వావిలాలపల్లిలో ఏఐఎఫ్టీయూ ఆఫీసు తెరిచాను. లారీ, రవాణా కార్మికులను కూడగట్టాను. పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి జనంలోకి వెళ్లాలని, ప్రజాసంఘాలు బలపరిచిన అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయాను. అప్పుడే చొప్పదండి నుంచి వీరయ్య, సిరిసిల్ల నుంచి చలపతిరావు పోటీ చేశారు. 1995లో పార్టీలో చీలికలు వచ్చాయి. నా భర్త రాజేందర్ మెట్పల్లి కోర్టులో లొంగిపోయాడు. 1996 నుంచి నేనూ ఇన్‌యాక్టివ్ అయ్యాను. జిల్లాను వదిలి హైదరాబాద్ వెళ్లాం. ప్రజా సంఘాల సమావేశాలు, సభలకు హాజరయ్యేదాణ్ని. అక్కడే ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. ఫీజు కట్టే స్తోమత లేక ఎల్ఎల్బీ చేయలేకపోయా. కేసీఆర్ స్ఫూర్తి కరీంనగర్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన మొదటి సింహగర్జన సభ చూసేటందుకే హైదరాబాద్ నుంచి వచ్చినా. అదే స్ఫూర్తితో తెలంగాణ జెండా పట్టుకున్నా. అప్పుడే జెడ్పీటీసీ ఎన్నికలొచ్చాయి. మేడిపల్లి నుంచి పోటీ చేస్తావా.. అని అప్పటి జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రాజేశ్వరరావు ఫోన్ చేసి అడిగాడు. నాకైతే ఆసక్తి లేదని చెప్పినా. మా ఆయన తోపాటు మిత్రుల ఒత్తిడితో మరుసటి రోజు రాజేశ్వరరావును కలిసినా. నామినేషన్ వేయమన్నారు. వేసినా. టీఆర్ఎస్ పార్టీ అంటే నక్సలైట్ పార్టీ అనే ప్రచారం జరుగుతోందని.. నన్ను విత్‌డ్రా చేసుకొమ్మన్నారు. చేసుకున్నా. అదే ఎన్నికల ప్రచార సభకు జగిత్యాలకు వచ్చినప్పుడు కేసీఆర్‌ను కలిశాను. ఆ పరిచయంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు డివిజన్లకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. తర్వాత మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కార్మికశాఖ సెంట్రల్ అడ్వయిజరీ బోర్డులో నేను మెంబర్‌గా ఉన్నా. జగిత్యాల ఏరియాలో బీడీ కార్మికుల డిమాండ్లు సాధ్యమయ్యాయి. 2009లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నా. నిజాం ఆసుపత్రికి వెళితే.. ‘ఉమా.. గో ఎహెడ్’ అన్నారు. అందుకే ఉద్యమ బాట వీడలేదు. 2009లో మెట్పల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు వస్తుందని అనుకున్నా. రాలేదు. ఈసారి జెడ్పీ సీటు బీసీ మహిళకు రిజర్వు కావటంతో కేసీఆర్ ముందే అభయమిచ్చారు. ఆయన ఆశీర్వాదంతో జెడ్పీ చైర్పర్సన్ అయ్యా.. మల్లక్కతో అటాచ్ బీడీకార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు రంగవల్లి సారథ్యంలో యూనివర్సిటీ విద్యార్థులు ఒకసారి మా పల్లెకు వచ్చారు. సమస్యలు చెప్పమంటే చెప్పినా. వాళ్లకు చాయ్ తెమ్మంటే నేనే తెచ్చిచ్చినా. మా పక్కింట్లో రాజేశ్వరి అని దోస్త్ ఉండే ఎటు వోయినా నన్ను తోడుగా తీస్కపోయేది. ఆమెతోనే నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది. అన్నలు చెప్పిండ్రు... బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకుందాం.. రా అని చెప్పి రాజేశ్వరి నన్ను పక్క ఊరికి తీసుకెళ్లింది. ఆ రోజు మళ్లీ మా ఇంటికి పోలేకపోయినా. ఏమంటరో.. ఏమనుకుంటరో.. అనే భయంతోనే తెల్లారి కూడా పోలే.. ఒకటీ రెండు రోజులు... వారాలు గడిచాయి. తోటి అక్కలతో తిరుగుతున్నా. ఇంట్లో ఏడుస్తున్నరు.. రమ్మంటున్నరని కబురు వచ్చింది. నెలరోజుల తర్వాత ఊరికి పోయినా. ఇంటి దగ్గరే ఉంటా అనుకున్నా. లేదు లేదు నువ్వు చురుగ్గా ఉన్నావ్... గ్రామస్థాయిలో ర్యాలీలు తీయాలి.. కూలీ రేట్లు పెంచేందుకు పోరాడాలే.. పార్టీ పాఠాలు నేర్చుకోవాలే... అని నరేందర్ అన్న పట్టుబట్టారు. కారం మల్లక్క అనే దళ సభ్యురాలితో నన్ను అటాచ్ చేశారు. అప్పటికే అన్నలల్ల కలిసిపోయిందనే ప్రచారం మొదలైంది. అప్పుడు వ్యవసాయ కూలీ రోజుకు రెండు, మూడు రూపాయలుండే. కూలీ పెంచాలని, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ర్యాలీలు చేసినం.