రాయికల్ :రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మతిస్థిమితం కోల్పోతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. రాయికల్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేఖి అయిన ఆంధ్రా సీఎం చంద్రబాబుతో కలిసి తెలంగాణలో సభలు నిర్వహించడం తెలంగాణ తమ్ముళ్లకు సిగ్గుగా లేద అన్నారు. రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు ఆరోపణలు మానకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సర్పంచులు జయ, రాజన్న, వ్యాపారి అనంతుల మల్లేశం, చౌడారపు లక్ష్మీనారాయణ టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి సంజయ్‌కుమార్, నాయకులు రమాదేవి, హన్మాండ్లు, శ్యాసుందర్‌రావు, అనిల్ పాల్గొన్నారు.