కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమకు తృటిలో ప్రమాదం తప్పింది.
సిద్దిపేట(మెదక్ జిల్లా): కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమకు తృటిలో ప్రమాదం తప్పింది. రాజధానిలో జరిగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు తుల ఉమ మంగళవారం వెళుతున్నారు. సిద్దిపేట సమీపంలో కొండపాక మండలం దుద్దెడ సమీపంలో రెండు కార్లు ఢీ కొని, ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వం నూతనంగా కేటాయించిన ఇన్నోవా వాహనంలో ఎయిర్ బెలూన్‌లు తెరుచుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సల్పగాయాలతో ఆమె భయటపడ్డారు.
ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న గన్‌మేన్, అటెండర్, డ్రైవర్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.