కరుణించవా...ప్రభూ! | Karuninchava ... prabhu | Sakshi
Sakshi News home page

కరుణించవా...ప్రభూ!

Published Thu, Feb 25 2016 2:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

కరుణించవా...ప్రభూ! - Sakshi

కరుణించవా...ప్రభూ!

జిల్లాలో కలగానే  రైల్వే సేవలుఅసంపూర్తిగా పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్
సర్వేలకే పరిమితమైనకొత్తలైన్ల నిర్మాణం
ఎంపీల ప్రతిపాదనలకుమోక్షం కలిగేనా?
నేడు రైల్వే బడ్జెట్

 
రైల్వేపరంగా జిల్లా వెనుకబాటు వీడడం లేదు. ఏళ్లు గడుస్తున్నా జిల్లా ప్రజలకు పూర్తిస్థాయి రైల్వే సేవలు కలగానే మిగిలాయి. ఏటా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గంపెడాశలు పెట్టుకోవడం, తీరా జిల్లాకు సంబంధించిన అంశాలు లేకపోవడంతో నిరాశ చెందడం రివాజుగా మారింది. అప్పుడప్పుడు అరకొరగా నిధులు విదిల్చుతున్నా, ఏ మూలకు సరిపోవడం లేదు. నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను పూర్తికాకుండా వెక్కిరిస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైను కాగితాలు దాటడం లేదు. కరీంనగర్ -హుస్నాబాద్- హైదరాబాద్ ప్రతిపాదనైతే కనీసం కాగితాలకు కూడా ఎక్కలేదు. గురువారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుండగా, ఈ బడ్జెట్‌లోనైనా ప్రభు కనికరం చూపుతారేమోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
                                           
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ లైను ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రద్ధ చూపి సరిపడా నిధులు కేటాయిస్తే సంవత్సరాల క్రితమే పూర్తయ్యేది. 178 కిలోమీటర్ల దూరం కాగా, చచ్చీచెడీ 150 కిలోమీటర్లు పూర్తి చేయగలిగారు. పాలకుల అలక్ష్యం ఫలితంగా ఇంకా 28 కిలోమీటర్ల మేర దూరం మిగిలే ఉంది. ఇది కూడా పూర్తి చేస్తే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు లింక్ ఏర్పడుతుంది. గత బడ్జెట్‌లో ఈ రైలుమార్గానికి కేంద్రప్రభుత్వం రూ.141 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తే వచ్చే సెప్టెంబర్ కల్లా కరీంనగర్-నిజామాబాద్ నడుమ రైళ్లు తిరుగుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

కాగితాలు దాటని కొత్తపల్లి-మనోహరాబాద్
అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేలా 2004లో ప్రతిపాదించిన కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు మార్గం కాగితాలను దాటడం లేదు. ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కాస్త కదిలిన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ, ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ షరతు విధించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో పూర్తయ్యే ఈ మార్గానికి ఇప్పటివరకు మంజూరైన రూ.20 కోట్లతో సీఈ కార్యాలయం, మానవ వనరుల లభ్యత తదితర మౌలిక వసతులకు ఖర్చుచేయాలని ఆదేశాలున్నా, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు.

 మంత్రులైనా ఆగాల్సిందే...
ఉప్పల్, బిజిగిరి షరీఫ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీల ప్రతిపాదనల మేరకు గత బడ్జెట్‌లో ఉప్పల్ వంతెనకు రూ.53.64 కోట్లు, బిజిగిరి షరీఫ్‌కు రూ.50.01 కోట్లు కేటాయించినప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైలు వ స్తుందంటే చాలు హుజూరాబాద్-జమ్మికుంట మార్గంలోని ఉప్పల్ గేటు వద్ద గంటలకొద్ది ప్రయాణికులు పడిగాపులు పడాల్సిన దుస్థితి. చివరకు మంత్రులకు సైతం ఇదే పరిస్థితి ఎన్నోసార్లు ఏర్పడుతోంది. కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని కరీంనగర్-రాయపట్నం రహదారిలో సైతం ఇదే పరిస్ధితి. ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి ఇంకా అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు పనులు త్వరగా పూర్తి చేస్తే తప్ప ఈ బాధ నుంచి ఆ ప్రాంత ప్రజలు విముక్తికారు.

 సా...గుతున్న పనులు
నిధులుండి కొన్ని, సరిపడా నిధులు రాక మరికొన్ని ప్రతిపాదిత రైల్వే పనులు సా...గుతున్నాయి.
పెద్దంపేట-మంచిర్యాల మూడో లైను మార్గం కోసం రూ.58 కోట్లు కేటాయించగా పనులు ఇంకా పూర్తి కాలేదు.
రాఘవాపూర్-మందమర్రి మూడో మార్గం కోసం రూ.24.90 కోట్లు మంజూరు చేయగా పనులు నడుస్తున్నాయి.
రామగుండం-మణుగూరు లైన్ సర్వేకు రూ.50 లక్షలు, కరీంనగర్-హసన్‌పర్తి లైన్ సర్వేకు రూ.14.73 లక్షలు కేటాయించినా సర్వే మొదలు కాలేదు.

మణుగూరు-భూపాల్‌పల్లి-కమాన్‌పూర్, రామగుండం కోల్ కారిడార్ రైల్వేనిర్మాణం సర్వే కోసం గత బడ్జెట్‌లో రూ.50 లక్షలు కేటాయించగా పనులు ప్రారంభించలేదు. రూ.1500 కోట్లు నిర్మాణ వ్యయమయ్యే ఈ లైన్‌కు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు కావాల్సి ఉండడంతో రైల్వేశాఖ ముందుకురావడం లేదని సమాచారం.

కరీంనగర్-తిరుపతి రైలును ప్రతీరోజు నడిపించాలనే డిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు.
రామగుండం, పెద్దపల్లి స్టేషన్లలో చెన్నై-ఢిల్లీ గరీబ్థ్నవజీవన్, జైపూర్, స్వర్ణజయం తి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపడం లేదు. రామగుండం-పెద్దపల్లి, కరీంనగర్-జగిత్యాల లైన్‌లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే ఎంపీ ల విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు.
 
 ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం లభించేనా?
  
జిల్లాలో రైల్వే సేవల విస్తృతి కోసం ఎంపీలు ప్రతిపాదనలు చేస్తున్నా, అవి అమలుకు నోచుకోడం లేదు. పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తున్నా, కేంద్ర సర్కారు కనికరించడం లేదు. ఒకటీ అరా ప్రతిపాదనలు అంగీకరిస్తున్నా, అవి కూడా అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ కోసం కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్‌లు ఇప్పటికే ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో ఎన్ని ప్రతిపాదనలు గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అమలుకు నోచుకొంటాయో వేచి చూడాలి.
 
 పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రతిపాదనలు
  
ఇంటర్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీకోచ్ సదుపాయం కల్పించాలి.
రామగిరి ప్యాసింజర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, కాగజన్‌నగర్ ఎక్స్‌ప్రెస్, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్లకు అదనపు కోచ్‌ల సదుపాయం కల్పించాలి.తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, కేర ళ ఎక్స్‌ప్రెస్, ఎస్‌సీ-ఎన్‌జీపీ ఎక్స్‌ప్రెస్, జీటీ ఎక్స్‌ప్రెస్‌లను పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో నిలపాలి.

కరీంనగర్-తిరుపతి రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోవాలి.
పెద్దపల్లి రైల్వేస్టేషన్ కౌంటర్‌లో 24 గంటల రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బల్లార్షా-విజయవాడకు ప్రత్యేక రైళ్లు నడిపించాలి.
పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌షెడ్‌కు మరమ్మతు చేపట్టాలి. సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మించాలి.
కూనారం, కొలనూరు రైల్వేక్రాసింగ్‌ల వద్ద ఫ్లైఓవర్‌బ్రిడ్జీలు నిర్మించాలి.

సిర్‌పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇంట్రాసిటీ రైలు ప్రవేశపెట్టాలి. ఉదయం 5.30కు కాగజ్‌నగర్‌లో బయలుదేరి, 9.30కు సికింద్రాబాద్ చేరుకునేలా, సాయంత్రం 5.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాగజ్‌నగర్ చేరేలా ఈ రైలు నడిపించాలి.
మానిక్‌గర్ నుంచి సికింద్రాబాద్‌ల నడుమ కొత్త రైలు సర్వీసు ప్రవేశపెట్టాలి.భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌ల నుంచి 24 కోచ్‌లకు, కాజీపేట నాగ్‌పూర్ ప్యాసింజర్‌కు 12 నుంచి 20 కోచ్‌లకు పెంచాలి.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, రోడ్డుమార్గం వైపు మళ్లకుండా, రైల్వేకు ఆదాయం సమకూర్చుకునేందుకు రామగుండం రూట్‌లో సమయానుకూలంగా ప్రత్యేక రైళ్లు నడిపించాలి.

ప్రయాణికులను ఆకర్షించేందుకు సింగరేణి ప్యాసింజర్‌లో పరిశుభ్రత ఉండాలి. మంచి కోచ్‌లు ఏర్పాటు చేయాలి. ఏసీ చైర్ , స్లీపర్ ఏర్పాటుచేయాలి.రామగుండం రైల్వేస్టేషన్‌లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం స్టేషన్‌లో ఎక్స్‌లేటర్‌లు ఏర్పాటు చేయాలి.అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం శబరిమలై  వెళ్లేందుకు కరీంనగర్, సిర్‌పూర్ కాగజ్‌నగర్ నుంచి కొల్లంకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపించాలి.స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్, జైపూర్  మద్రాస్ ఎక్స్‌ప్రెస్, కొంగు ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, దర్భంగా ఎక్స్‌ప్రెస్, మిలీనియం(ఎర్నాకులం) రైళ్లకు రామగుండం స్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలి.

కమాన్‌పూర్ మండలం రాణాపూర్‌లో లోలెవల్ క్రాసింగ్ బ్రిడ్జి, కన్నాలలో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి.కాజీపేట జంక్షన్ నుంచి భూపాల్‌పల్లి, తాడిచర్ల, మంథని మీదుగా రామగుండం వరకు కొత్త రైల్వేలైను నిర్మించాలి.రామగుండం రైల్వేస్టేషన్ నుంచి మంథని, తాడిచర్ల, భూపాలపల్లి, ఏటూరునాగారం, కమలాపూర్ మీదుగా మణుగూరు రైల్వేస్టేషన్ వరకు కొత్త రైల్వేై లెను నిర్మించాలి.
 
కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రతిపాదనలు
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి.
ఆర్మూరు-నిజామాబాద్ మధ్యలో రైల్వేలైను పూర్తిచేయాలి.
కరీంనగర్ నుంచి ముంబై వరకు ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలి.
బిజిగిరిషరీఫ్, ఉప్పల్‌రైల్వే ఓవర్‌బ్రిడ్జి డిజైన్ ఆమోదించి, వెంటనే పనులు ప్రారంభించాలి.
కరీంనగర్-తిరుపతి రైలు సర్వీసును ప్రతిరోజు నడపాలి.
తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement