రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయండి: కవిత
పసుపు రైతులతో పార్లమెంటరీ వాణిజ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల సమస్యలను పసుపు బోర్డు ఏర్పాటుతో పరిష్కరించవచ్చని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాణిజ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కమిటీ సభ్యురాలైన నిజామాబాద్ ఎంపీ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో సాగువుతున్న పసుపులో 50 వేల ఎకరాలు తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోనే సాగవుతుందని వివరించారు.
ఆర్థికంగా నష్టం వస్తున్నా రైతులు పసుపు సాగు వదులుకోలేక పోతున్నారని అన్నారు. దేశీయంగా పసుపు సాగుకు డిమాండ్ అధికంగా ఉన్నా, ఇతర దేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్న తీరును కవిత ఆక్షేపించారు. ఈ చర్య పసుపు సాగును మరింత సంక్షోభంలోకి నెడుతుందన్నారు. స్పైస్ బోర్డు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు ఆంధ్రా, విజయాబ్యాంకు ఎండీ, సీఎండీలతోనూ సమావేశమయ్యారు. పసుపు రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కమిటీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స్పైస్ బోర్డు చైర్మన్ డాక్టర్ జయతిలక్ సమాధానమిచ్చారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పలువురు పసుపు రైతులు ఎంపీ కవిత నేతృత్వంలో కమిటీ ప్రతినిధులను కలిశారు.
మద్దతు ధరగా రూ. 16,500 ఇవ్వాలి
బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావులు వినతి పత్రాలు సమర్పించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే పసుపు రైతులు ఆర్థిక నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి కమిటీకి సూచించారు. రూ. 16,500 కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించాలని కోరారు. ఎకరా పసుపు సాగుకు రూ. 1.10 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.
సుగంధ ద్రవ్యాలు సాగు చేసే జిల్లాల్లో బోర్డు ప్రతినిధి..
సుగంధ ద్రవ్యాలు (స్పైస్) సాగు చేసే జిల్లాల్లో తమ ప్రతినిధిని ఒకరిని నియమిస్తా మని సుగంధ ద్రవ్యాల బోర్డు రాష్ట్ర ప్రభు త్వానికి హామీ ఇచ్చింది. ఈ విషయంపై వ్యవ సాయశాఖ కార్యదర్శి బోర్డు చైర్మన్‌కు విన్న వించారు. రాష్ట్ర స్థాయిలోనూ ఒక ప్రతినిధిని నియమిస్తామని బోర్డు స్పష్టం చేసిందని పార్థ సారథి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవ సాయ కమిషనర్ జగన్మోహన్, ఉద్యాన కమిష నర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, పరిశ్రమల కార్య దర్శి అహ్మద్ నదీమ్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు.