సీఎం సాబ్..జర దేఖో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమ ముద్దు బిడ్డ.. నీవు ఎరుగనిదా ఈ గడ్డ.. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెయ్యి కళ్ల తో ఎదురుచూస్తోంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది.
బుధవారం కేసీఆర్ గజ్వేల్‌కు వస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలోని సమస్యలను ఒకసారి స్పృశిస్తే.. పక్కనే మంజీర పారుతున్నా ‘గజవెల్లి’ ఎండుతోంది. జీవనాడుల లాంటి హల్దీ, కుడ్లేరు వాగులున్నాయి. కాని పాలకుల నిర్లక్ష్యం వల్ల 60 ఏళ్లుగా ఈ నేల మీద రైతు కన్నీళ్లు కార్చని రోజేలేదు. ఆకలి చా వులు,అన్నదాతల ఆత్మహత్యలకు గజ్వేల్ కేంద్రమైంది.
ఏళ్లకేళ్లుగా ఎండిపోతున్న గజ్వేల్‌కు కేసీఆర్ ఎమ్యెల్యేగా గెలవడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ‘జీవ’గంజి పోసినట్టయింది. మొత్తం 2.99 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న గజ్వేల్ నియెజకవర్గంలోని ఐదు మండలాలలో 54 చెరువులు, 625 కుంటల కింద కలుపుకుంటే వర్షాకాలంలో కేవలం 19,768 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.
దాదాపు 28 వేల బావులు, బోర్ల కింద కలుపుకుని మరో 40 వేల ఎకరాలల్లో ఏడాది ఒక పంటకు నీళ్లు అందుతున్నాయి. నియోజక వర్గానికి లక్ష ఎకరాల సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చిన గులాబీ దళపతి సీఎంగా బుధవారం తొలిసారి గజ్వేల్‌కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే. కేసీఆర్ చల్లని చూపుకోసం ప్రజలు, రైతాంగం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది.
‘ప్రాణహిత’ చేపడితేనే..
ప్రాణహిత-చేవేళ్ల ఎత్తిపోతల పథకం పూర్తరుుతే గజ్వేల్ ప్రాంతానికి నీటి సమస్య తీరుతుంది. ప్రాణహిత నదిలో ప్రస్తుతం 305టిఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కిందులో ప్రధానంగా లబ్ధి పొందేది మెదక్ జిల్లాయే. ప్రాణహిత నుంచి నీటిని కాకతీయ కెనాల్ ద్వారా మిడ్‌మానేర్‌కు కలుపుతారు. అక్కడి నుంచి అనంతగిరి మీదుగా మన జిల్లా సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కు తీసుకు వస్తారు. ఇమాంబాద్‌లో రిజర్వాయర్ నిర్మించి లిఫ్ట్ ద్వారా తడ్కపల్లిలో నిర్మించే రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి కొండపాక మండలం తిప్పారం చెరువులోకి నీరు మళ్లిస్తారు. ఇక్కడి నుంచి లిప్ట్ ద్వారా వర్గల్ మండలం పాములపర్తి చెరువులోనికి నీటిని తెస్తారు.
ఇక్కడి నుంచి చేబర్తి చెరువులోకి నీటిని వదిలి ఆ చెరువు నుంచి ప్రారంభమయ్యే వాగు ద్వారా జగదేవ్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. అలాగే గజ్వేల్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాలకు కాల్వల ద్వారా నీటిని పంపించే విధంగా ఇంజినీర్లు పథకం రూపొందించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఆయన మరణంతోనే ఆగిపోయాయి. కేసీఆర్ దృష్టి పెడితే ఏడాది లోపే ప్రాజెక్టు పనులు పూర్తయి సాగునీరు అందుతుంది.
కుడ్లేరుతో కడగండ్లు తీరు..
గజ్వేల్ నియోజకవర్గానికి హల్దీ, కుడ్లేరు వాగులు ఇక్కడి వ్యవసాయానికి గుండెకాయలు. గజ్వేల్‌లో ఈ వాగు 45 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నది. దాదాపు 60 వేల క్యూసెక్కుల నీళ్లు ఎగువ మానేరులో కలుస్తాయని అంచనా. వీటిలో దాదాపు 70 శాతం నీళ్లు ఎగువ మానేరులో వృథాగా కలిసిపోతున్నాయి. కుడ్లేరు వాగుపై రాయువరం-తీగుల్ గ్రావూల వుధ్య రూ. 4 కోట్ల వ్యయుంతో 2005లో రాచకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఈ జలాశయుంలోని కుడి, ఎడవు కాల్వల ద్వారా 1,560 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంగా నిర్ణరుుంచారు. కానీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ లక్ష్యం నెరవేరడం లేదు. అదేవిధంగా ధర్మారం-వర్దరాజ్‌పూర్ గ్రావూల వుధ్య నిర్మించిన బోరబండ జలాశయుం ద్వారా 568 ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీటిని అందించాలని నిర్ణరుుంచారు. 1990లోనే ఈ ప్రాజెక్టు పూర్తరుునప్పటికీ ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోక శిథిలవుయ్యూరుు.
ఆపదలో కాపాడే హల్దీ వాగు..
వురో ప్రధాన వాగు హల్దీ. ఈ వాగు వర్గల్ వుండలం తపాల్‌ఖాన్ చెరువు నుంచి ప్రారంభమై గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రావూయుంపేట వుండలాల మీదుగా బొవ్మూరం నుంచి మెదక్‌లోని వుంజీర నదిలో కలుస్తుంది. ఈ వాగు 50కి.మీ పొడవునా నియోజకవర్గంలో ప్రవహిస్తుంది. ఈ వాగుపై సైతం అవసరవున్నచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలు భూగర్భజలాల పెంపునకు దోహదపడుతున్నారుు.