కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్న కేసీఆర్ | KCR gives details of Intensive household survey | Sakshi
Sakshi News home page

కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్న కేసీఆర్

Published Tue, Aug 19 2014 2:09 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్న కేసీఆర్ - Sakshi

కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్న కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. మంగళవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో సర్వే అధికారులకు వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. నందినగర్ లో ఇల్లు, ఎర్రవల్లిలో ఫాంహౌస్ డాక్యుమెంట్ల వివరాలను అందచేశారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తోన్న సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.  సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement