హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.