
కేసీఆర్ రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: మెదక్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేసిన రాజీనావూను ఈ నెల 29న ఆమోదించినట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానంతోపాటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయున టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో పాటు, జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే యనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మెదక్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల 26న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.