
వచ్చే నెలలో 40 కోట్ల మొక్కలు నాటాలి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే నెలలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని, తెలంగాణ వ్యాప్తంగా 40 కోట్లు మొక్కలు నాటాలని కేసీఆర్ చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఒక ప్రజా ఉద్యమని అన్నారు. పోలీసులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. హరితహారం కోసం బస్సులో అన్ని జిల్లాలు తిరుగుతానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు దేశ వ్యాప్తంగా మంచి పేరుందని కేసీఆర్ చెప్పారు.