హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. గురువారం టోలిచౌక్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరిగివస్తున్న కేసీఆర్‌కు.. రోడ్డుపై ఓ వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో చలించిపోయిన పోయిన కేసీఆర్ కాన్వాయ్ ఆపి.. ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. దీంతో తనను సీఎంకు పరిచయం చేసుకున్న వృద్ధుడు సలీమ్.. తాను గతంలో డ్రైవర్‌గా పనిచేశానని.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తన సమస్యను కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. సలీమ్ సమస్యను వెంటనే పరిష్కారించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో టోలిచౌక్‌లోని సలీమ్ ఇంటికి వెళ్లిన కలెక్టర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. అలాగే సలీమ్‌కు సదరం సర్టిఫికెట్ ఉండటంతో వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సలీమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి.. చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో డ్రైవర్ గా పనిచేసి, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్ సలీమ్ అనే వికలాంగుడు, వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. pic.twitter.com/xwA7Aw6SlX
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2020
Comments
Please login to add a commentAdd a comment