ఇది ట్రైలరే... సినిమా ముందుంది!
పొన్నాలకు మంత్రి కేటీఆర్ చురకలు
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు చూస్తున్నది ట్రైలర్ మాత్రమేనని మున్ముందు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్‌లో ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొనేందుకు వచ్చి న ఆయన మీడియాతో మాట్లాడుతూ పొన్నాల తలపెట్టిన పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా, తలకిందుల యాత్ర చేపట్టినా తమకు నష్టం లేదని వెల్లడించారు. లక్ష్మయ్య భవిష్యత్‌లో ఇంకా చాలా యాత్రలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోనే కాంగ్రెస్ అంతర్థానం అయిపోయిందని అన్నారు. సచివాలయం మార్పుపై అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. 13న తెలంగాణ పల్లె ప్రగతి మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభమవుతుందని అన్నారు.