
ప్రదర్శనలో పాల్గొనేందుకు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానానికి చేరుకున్న వాహనాలు
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతోపాటు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం వచ్చిందని, అందరూ ప్రగతి నివేదన సభను వేదికగా చేసుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని రాష్ట్ర మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అన్నారు. ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నగరంలో బైక్, ఆటోల భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థాని క ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఇల్లెంద్ క్రాస్ రోడ్డు, జెడ్పీసెంటర్, వైరారోడ్డు, బస్టాండ్, మయూరిసెంటర్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డు మీదుగా పీఎస్‌ఆర్ రోడ్డు, గాంధీచౌక్, గాంధీగంజ్, కిన్నెరసాని థియేటర్, జహీర్‌పుర, చర్చ్‌కాంపౌండ్, చెరువుబజార్, జమ్మిబండ, గట్టయ్యసెంటర్ మీదుగా టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేరుకుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌లు కలిసి బైక్‌పై ప్రదర్శనలో పాల్గొని నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర స్వరూపమే మారిందని, అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతోందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన సేవలు, అమలు చేసిన సంక్షేమ పథ కాలను దృష్టిలో ఉంచుకొని సభకు తరలివెళ్లేం దు కు ఆసక్తి చూపిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రదర్శనలో 2వేల మోటార్ సైకిళ్లు, 1400 ఆటోలు పాల్గొన్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కమర్తపు మురళి, నాగరాజు పాల్గొన్నారు.

నగరంలో బైక్, ఆటోల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment