ఇరిగేషన్ ఏఈపై మండిపడ్డ కలెక్టర్ నీతూప్రసాద్
వెల్గటూరు : ఏం తమాషా చేస్తున్నారా... వారం రోజుల నుంచి చెప్పుతున్నా ను... భక్తులకు కొత్తఘాట్లను అందుబాటులోకి తేవాలని.. మీరెందుకు పట్టిం చుకోవటం లేదు... జాబ్ చేస్తున్నారా.. చోద్యం చూస్తాన్నారా... మనుషుల ప్రా ణాలంటే విలువలేదా..? అని ఇరిగేషన్ ఏఈ భాస్కర్‌పై బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కోటిలింగాల పుష్కర ఘాట్లను పొద్దు పోయాక కలెక్టర్ పరిశీలించారు. కొత్తఘాట్ల కింద ఇసుక బస్తాలను వేసి వాటి ని వినియోగంలోకి తేవాలని వారం రోజుల ముందు నుంచి చెబుతున్నాను. ఎందుకు ఆదేశాలను ఖాతర్ చేయడంలేదని ఏఈపై విరుచుకపడ్డారు.
వారం రోజులు నుంచి చెప్పుతున్నా ఘాట్ల వద్ద ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆగ్రహించారు. ఈ రోజు వచ్చిన 25 వేల మంది భక్తులే పుణ్య స్నానాలు చేయడానికి చాల ఇక్కట్లు పడ్డారు. రేపు రెట్టింపు సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారిని ఎలా మెయింటెన్ చేస్తారని మండిపడ్డారు. ఖచ్చితంగా రెండు రోజుల్లో కొత్త పుష్కర ఘాట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త పుష్కర ఘాట్లను ఎలా పెంచితే భక్తులకు వినియోగ పడుతాయనుకుంటే అలాగే చేయించండి, ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం నుంచి అందజేస్తామని, ఎంపీపీ శ్రీనివాసరావుకు పుష్కర ఘాట్లను పెంచే బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు.
తమాషా చేస్తున్నారా...?
Published Thu, Jul 16 2015 4:26 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement