irrigation AE
-
ఏసీబీ వలలో ఇద్దరు ఇరిగేషన్ ఎఈలు
–రూ.48వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత నెల్లూరు(క్రైమ్): నీరు-చెట్టు పనుల్లో కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకొంటుండగా ఇద్దరు ఇరిగేషన్ ఏఈలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన శాకమూరి సుందరనాయుడు క్లాస్–3 కాంట్రాక్టర్. 2016 ఆగస్టులో నీరు-చెట్టు పథకం కింద కొన్ని చెరువుల మరమ్మత్తులు, కోర్‌వెల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. సుందరనాయుడు మావూరమ్మ చెరువుకట్టపనికి రూ. 26,25,368తో, వెంకటగిరి ట్యాంకు కోర్‌వెల్ నిర్మాణానికి రూ.32,83,922తో టెండర్లు వేసి పనులు దక్కించుకొన్నాడు. వాటి నిర్మాణ పనులను తన బంధువు అయిన శ్రీరామచౌదరికి అప్పగించి ఈ ఏడాది ఏప్రిల్ 2017 నాటికి పూర్తిచేయించాడు. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించిన ఎం బుక్‌లు ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఏఈలు చంద్రమౌళి, గిరిధర్ల వద్దకు వచ్చాయి. దీంతో శ్రీరామచౌదరి ఈ నెల 12వ తేదిన ఏఈ గిరిధర్‌రాజుకు ఫోన్ చేయగా మంగళవారం నెల్లూరుకు వచ్చి తనతో, చంద్రమౌళితో మాట్లాడాలని సూచించారు. దీంతో జరిగిన విషయాన్ని శ్రీరామచౌదరి కాంట్రాక్టర్ సుందరనాయుడుకు చెప్పడంతో ఆయన మంగళవారం నెల్లూరుకు వచ్చి ఏఈలను కలిశారు. ఈ సందర్భంగా ఎఈలు ఎం బుక్స్‌ను పరిశీలించి పంపాలంటే రూ.30వేలు, గిరిధర్ వద్ద ఉండే బుక్స్ పంపాలంటే రూ. 18వేలు ఇవ్వాలని లేదంటే బుక్స్ అధికారులకు పంపేది లేదని తేల్చిచెప్పారు. వారికి లంచం ఇవ్వడం ఇష్టంలేని సుందరనాయుడు అదేరోజు జరిగిన విషయాన్ని ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో బాధితుడు రూ.48వేలు నగదును ఏఈలకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తన సిబ్బందితో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ
వరంగల్ : నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారి ఒకరు మంగళవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కారు. వరంగల్ ఇరిగేషన్ ఏఈ సురేందర్‌రావు పనుల ఎస్టిమేషన్ కోసం ప్రకాశ్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి తన కార్యాలయంలో రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
తమాషా చేస్తున్నారా...?
ఇరిగేషన్ ఏఈపై మండిపడ్డ కలెక్టర్ నీతూప్రసాద్ వెల్గటూరు : ఏం తమాషా చేస్తున్నారా... వారం రోజుల నుంచి చెప్పుతున్నా ను... భక్తులకు కొత్తఘాట్లను అందుబాటులోకి తేవాలని.. మీరెందుకు పట్టిం చుకోవటం లేదు... జాబ్ చేస్తున్నారా.. చోద్యం చూస్తాన్నారా... మనుషుల ప్రా ణాలంటే విలువలేదా..? అని ఇరిగేషన్ ఏఈ భాస్కర్‌పై బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కోటిలింగాల పుష్కర ఘాట్లను పొద్దు పోయాక కలెక్టర్ పరిశీలించారు. కొత్తఘాట్ల కింద ఇసుక బస్తాలను వేసి వాటి ని వినియోగంలోకి తేవాలని వారం రోజుల ముందు నుంచి చెబుతున్నాను. ఎందుకు ఆదేశాలను ఖాతర్ చేయడంలేదని ఏఈపై విరుచుకపడ్డారు. వారం రోజులు నుంచి చెప్పుతున్నా ఘాట్ల వద్ద ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆగ్రహించారు. ఈ రోజు వచ్చిన 25 వేల మంది భక్తులే పుణ్య స్నానాలు చేయడానికి చాల ఇక్కట్లు పడ్డారు. రేపు రెట్టింపు సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారిని ఎలా మెయింటెన్ చేస్తారని మండిపడ్డారు. ఖచ్చితంగా రెండు రోజుల్లో కొత్త పుష్కర ఘాట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త పుష్కర ఘాట్లను ఎలా పెంచితే భక్తులకు వినియోగ పడుతాయనుకుంటే అలాగే చేయించండి, ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం నుంచి అందజేస్తామని, ఎంపీపీ శ్రీనివాసరావుకు పుష్కర ఘాట్లను పెంచే బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. -
నిర్లక్ష్య తాండవం
- గేట్లు మూసుకోక ముఠా ఆనకట్ట నీరు వృథా - మరమ్మతులు జరిపినా దక్కని ఫలితం - సాగునీరందక రైతుల్లో ఆందోళన పాయకరావుపేట: తాండవ నదిపై ఉన్న ముఠా ఆనకట్ట నుంచి మంగవరం కాలువ ద్వారా ఆరట్లకోట, గుంటప ల్లి, మంగవరం, గోపాలపట్నం, సత్యవరం, మాసాహెబ్‌పేట పరిధిలోని సాగుభూములకు, కుడి కాలువ ద్వా రా రామభద్రపురం, రాంపురం, కేశవరంతోపాటు తుని మండలంలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో మోస్తరుగా నీరుంది. కానీ ఆనకట్ట కుడివైపు గేట్లు మూసుకోక పోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లే నదిలోకి వృథాగా పోతోం ది. అది అలాగే వెళ్లి సముద్రంలో కలిసిపోతోంది. సమస్యను గుర్తించిన అధికారులు కొద్దిరోజుల క్రితం గేట్లు సరి చేసే నిపుణులను తీసుకువచ్చి పనులు చేయించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నీటి వృథా ఆగలేదు. దీంతో కాలువలోకి అరకొరగానే నీరు పారి శివారు భూములకు నీరందడం లేదు. నిర్మాణ లోపంతోపాటు గతంలో వచ్చిన తుఫాన్ వరదలకు ఆనకట్టకు ఎడమవైపున ఉన్న మూడు గేట్లు పూర్తిగా వంగిపోయాయి. నీటిపారుదల శాఖ అధికారులు అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు జరిపి నీటిసరఫరా అయ్యిందనిపించేవారు. తాండవ నదిలోకి భారీగా నీరు వస్తే తప్ప కాలువల్లోకి నీరు రాని పరిస్థితి మొదటి నుంచీ ఉంది. కాని సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం నదిలో నీటి ఉధృతి లేకపోవడంతో కాలువల్లోకి పూర్తిస్థాయిలో నీరు వెళ్లడం లేదు. కాలువ నీరు అందుతుందన్న ఆశతో రైతులు నాట్లుకు సిద్ధమయ్యారు. తీరా పరిస్థితి ఇలా ఉండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిర్మాణమప్పుడే లోపం ఈ సమస్య ఇప్పటిది కాదు. ఆనకట్ట నిర్మాణ సమయంలోనే గేట్ల ఏర్పాటులో లోపాలుండడంతో ఏటా సీజన్లో సమస్యవుతోంది. నీటి వృథాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాం. నదిలో నీరు తగ్గితే గేట్లు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. - సత్యనారాయణదొర, ఇరిగేషన్ ఏఈ -
సింగూరుతో సిరులు కురిపిస్తాం
- వచ్చే ఖరీఫ్ నాటికి 40 వేల ఎకరాలకు సాగునీరు - గత ప్రభుత్వ అలసత్వం.. - అధికారుల నిర్లక్ష్యం వల్లే ముందుకు సాగని కాలువ పనులు - నియోజకవర్గానికి ఒక్కరే డిప్యూటీ ఈఈ ఉండాలి - ఇరిగేషన్ ఏఈల డిప్యుటేషన్ల రద్దుకు ఆదేశాలు - నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి జోగిపేట: సింగూరు జలాలతో సిరులు కురిపిస్తామని, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సోమవారం పుల్కల్ మండలం సింగూరులోని గెస్ట్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు గత ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగలేదని ఆరోపించారు. నవంబర్ మాసంలోగా 10 వేల ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరును అందించేందుకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రాత్రింబవళ్లు పనులు చేపట్టాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కాలువ పనుల్లో భాగంగా నవంబర్ వరకు భూసేకరణ పనులు చేపట్టాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సుమారు 220 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, వీలైతే వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా భూసేకరణ చేపట్టాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు పంప్ హౌస్ నిర్మించాల్సి ఉందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు ప్రధాన కాలువ పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ వారానికి ఒక్క సారి తనకూ, స్థానిక ఎమ్మెల్యేకు నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. కాగా నియోజకవర్గానికి ఒక్కరే డిప్యూటీ ఈఈ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అందోలు నియోజకవర్గంలో ముగ్గురు డిప్యూటీ ఈఈలు ఉన్నారని, వెంటనే రీ ఆర్గనైజేషన్ చేపట్టాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. నియోజకవర్గానికి ఒక ఏఈ, డిప్యూటీ ఈఈ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యుటేషన్లు రద్దు జిల్లాలో పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈలు చాలామంది హైదరాబాద్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వెంటనే డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. తప్పనిసరిగా మండలాల్లో ఏఈలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జాలు వాగు పథకానికి మంత్రి గ్రీన్ సిగ్నల్ నియోజకవర్గం పరిధిలోని జాలు వాగు ద్వారా 1,800 ఎకరాలకు సాగుకు నీరందించేందుకు అవకాశం ఉండడంతో వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపునకు గురికాకుండా ఎత్తు పెంచేందుకు వీలుందా? లేదా అనే విషయంపై యాక్షన్‌ప్లాన్ తయారుచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో పూడిక తొలగించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే పి.బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ సీఈ మధుసూదన్, ఎస్ఈ అనిల్‌కుమార్, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీఈఈలు జగన్నాథం, రమేశ్, ఏఈ బాలగణేష్ మంత్రి వెంట ఉన్నారు. సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పుల్కల్: మండలంలోని సింగూర్(బాగారెడ్డి) ప్రాజెక్టును మంత్రి హరీష్‌రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ఉన్న నిల్వ, పారుదల, తాగునీరు, వంటి వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ఉన్న పూడిక, దాని వల్ల వచ్చే నీటి సమస్యను తెలియజేయాలని ఆయన సంబందిత అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా లిఫ్టు ఇరిగేషన్, ఎడుమ కాలువలను పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టును ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని, ఇప్పుడైనా ప్రాజెక్టును అభివృద్ధి పరిచేందుకు కృషి చేద్దామని మంత్రి తెలిపారు. -
వరంగల్‌లో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో అవినీతి చేప చిక్కింది. వరంగల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ ఐదువేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆదివారం రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. జయగిరి గ్రామానికి చెందిన ఎల్లయ్య జానకివారి చెరువు మరమ్మత్తుల కాంట్రాక్ట్ చేపట్టాడు. అందుకు రావాల్సిన బిల్లు కోసం ఏఈ శ్యాంసుందర్‌ను ఎల్లయ్య సంప్రదించాడు. బిల్లు మంజూరు కావాలంటే రూ.5 వేలు నగదు ముట్టజెప్పాలని ఎల్లయ్యను ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఏఈ ఆటకట్టించారు.