అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో అవినీతి చేప చిక్కింది. వరంగల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ ఐదువేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆదివారం రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. జయగిరి గ్రామానికి చెందిన ఎల్లయ్య జానకివారి చెరువు మరమ్మత్తుల కాంట్రాక్ట్ చేపట్టాడు. అందుకు రావాల్సిన బిల్లు కోసం ఏఈ శ్యాంసుందర్‌ను ఎల్లయ్య సంప్రదించాడు.
బిల్లు మంజూరు కావాలంటే రూ.5 వేలు నగదు ముట్టజెప్పాలని ఎల్లయ్యను ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఏఈ ఆటకట్టించారు.