
'సెక్షన్-8 పై అసత్య ప్రచారం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ -8 అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కుట్రలో భాగంగానే ఇలాంటి దుష్ర్పచారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.
పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.