section -8
-
పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పని సరి
నిడమర్రు : వివాహానికి చట్టబద్ధత కల్పించడం కోసేమే రిజిస్ట్రేషన్. గతంలో పెళ్లి పత్రికలు, ఫొటోలు మాత్రమే వివాహాలకు ఆధారంగా ఉండేవి. అలాకాకుండా వివాహాలు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. జరిగిన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పెళ్లి నమోదు పత్రం భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2002 మే లో రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని కూలాలు, మతాలు, వర్గాలకు వర్తించనుంది. ఈ చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. అన్ని జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌కు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహం నమోదు ఇలా.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరి తల్లితండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందించాలి. దరఖాస్తులు వధూవరుల వయస్సు తెలియజేసే ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు. వీటిని ఏదైనా గెజిటెడ్ అధికారితో ఎటాస్టడ్ చేయించుకోవాల్సి ఉంది. వీటితోపాటు శుభలేక, ఒక ఫొటో, కల్యాణ మండపంలో జరిగితే అద్దె రసీదు, దేవాలయంలో జరిగితే ఫీజు రసీదులు జత చెయ్యాలి. వధూవరులు తరుపున ముగ్గురు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. సాక్షుల ఆధార్ లేదా గుర్తింపు కార్డులు జత చెయ్యాలి. రిజిస్ట్రార్ ఈ సమాచారాన్ని రిజిస్ట్రర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే ప్రదేశంలోను, మన ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై ధ్రువీకరణ అధికారి సంతకం సీలు వేసి దంపతులకు అందిస్తారు. ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.210 ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏడాది దాటితే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి కోసం పంపేవారమని నేడు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గణపవరం సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కె.వజ్రం తెలిపారు. వివాహం ఎందుకు నమోదు చేసుకోవాలంటే..ఈ విధంగా నమోదు చేసుకుంటే జరిగిన వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. - కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేందుకు ఉపయోగపడుతుంది. -భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది. -వరకట్నం కేసులో నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది. -విడాకులుకోరే భార్య లేదా భర్త కూడా వివాహం జరిగినట్టు ఆధారం చూపించాల్సి ఉంటుంది. -రెండవ వివాహాలను అడ్డుకోవాడనికి మహిళలు లేదా పురుషులకు ఇది ముఖ్యమైన సాక్షంగా ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారానికి శిక్ష వివాహ నమోదు పత్రంలో మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి జరిమానా, లేదా ఈ రెండు అమలు చేస్తారు. - ఉద్దేశ పూర్వకరంగా అధికారి వివాహ నమోదు చెయ్యలేదని దరఖాస్తు దారుని ఫిర్యాదు రుజువైతే ఆఅధికారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా, లేదా రెండు శిక్షలు అమలు చేస్తారు. -
నోటీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ టూర్లు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత అంబటి ధ్వజం ♦ హైదరాబాద్‌లోనే తిష్ట వేస్తానన్న వ్యక్తిలో ఈ మార్పు ఎందుకొచ్చింది? ♦ ఆ స్వరం మీదో కాదో చెప్పకుండా సెక్షన్-8 అంటారా! ♦ టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మగా అభివర్ణించిన గవర్నర్‌కు అధికారాలన్నీ దత్తం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ నోటీసులను తప్పించుకునేందుకే సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఒక్క నిమిషమైనా ఉండకుండా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో తెగ తిరిగేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విమర్శించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకూ హైదరాబాద్‌లోనే ఉంటానన్న చంద్రబాబు వైఖరిలో తెలంగాణ ఏసీబీ కేసుల వల్ల తనకు సమస్యలొస్తాయని తెలిశాక మార్పెందుకు వచ్చిందని దుయ్యబట్టారు. ఏసీబీనుంచి నోటీసులొస్తాయని అనుమానం వచ్చినపుడల్లా కార్యక్రమాలేవీ లేకపోయినా రాజమండ్రి, విజయవాడ అంటూ పర్యటించేస్తున్నారని ఎద్దేవాచేశారు. అభివృద్ధిని ఆశించి ఈ పర్యటనలు చేయట్లేదని, నోటీసులొస్తాయనే భయంతోనే తప్పించుకోవడానికి వెళుతున్నారన్నారు. సీఎం ప్రజలమధ్య ఉండటం సంతోషమేఅయినా చంద్రబాబు ముందుగా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పితీరాలన్నారు. ‘‘ఆడియో టేపుల్లోని గొంతు మీదా(చంద్రబాబుదా), కాదా? టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఇచ్చి పంపిన రూ.50 లక్షలకు, మీకు సంబంధముందా, లేదా? రేవంత్‌రెడ్డి ‘బాస్’ అని ఉచ్ఛరించింది మిమ్మల్నా, కాదా?’’ అని ప్రశ్నించారు. టేపుల్లోని స్వరం చంద్రబాబుదేనని ప్రయోగశాలలో నిర్ధారణ అయ్యాక తన కేసుల్ని కప్పిపుచ్చుకునేందుకు సెక్షన్-8, టెలిఫోన్ ట్యాపింగ్ వంటి మాటలతోపాటుగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారని ఆయన విమర్శించారు. గంగిరెద్దు, టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మ అంటూ అభివర్ణించిన గవర్నర్‌కు ఇలా అధికారాలన్నీ దత్తంచేయాలనే ప్రయత్నం టీడీపీ ఎందుకు చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎందుకు సూచించలేదు? చంద్రబాబు గతేడాది జూన్ 24నే సెక్షన్-8 అమలుచేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినందున సెక్షన్-8లో ఏపీ ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ సంప్రదించాలన్న మార్పు కోరుతూ ఎందుకు లేఖలో సూచించలేకపోయారని అంబటి నిలదీశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల్ని సంప్రదించాకనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనే సవరణను సూచించివుంటే బాగుండేదన్నారు. పవన్... ‘పేయిడ్ ఆర్టిస్టు’గా వ్యవహరించొద్దు తెగేదాకా లాగొద్దన్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు చేతిలో ‘పేయిడ్ ఆర్టిస్ట్’(డబ్బు తీసుకునే నటుడు)గా వ్యవహరించొద్దని అంబటి హితవు చెప్పారు. అసలు కథేమిటో తెలుసుకోకుండా ఎప్పుడంటే అపుడు మేల్కొని హఠాత్తుగా నెల్సన్ మండేలాను ప్రస్తావించడం విడ్డూరమన్నారు. ప్రజలపక్షాన ప్రశ్నిస్తానన్న పవన్.. ‘చంద్రబాబు ఒక ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనడం తప్పా?, కాదా? టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతా? కాదా?, రేవంత్ టీడీపీవారా? కాదా?, ఆయన తీసుకెళ్లిన రూ.50 లక్షలు చంద్రబాబువా?, కావా?’ అని ఎందుకు ప్రశ్నించలేదని రాంబాబు నిలదీశారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల : ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం పులివెందులలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. తెలంగాణాలో అభాసుపాలైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోనూ అదే విధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసులో సహకరించడం లేదని ఏకంగా గవర్నర్‌నే మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అనే క సమస్యలతో బాధపడుతుంటే ఇవేవీ చంద్రబాబు పట్టిం చుకోకుండా కేసు నుంచి బయటపడేందుకు అనైతికంగా ఆలోచిస్తుంటే ఏపీ పోలీసులు దన్నుగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో చంద్రబాబు రాష్ట్రాన్ని మ ద్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలతో మమేకం : శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. తన వద్ద కు వచ్చిన వారి సమస్యలు ఓపికగా విన్న ఎంపీ పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేసి బిజీబిజీగా గడిపారు. -
బాబు రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లటౌన్ : సీఎం చంద్రబాబు నిజాయితీకి మారుపేరయితే ఆరోపణలు రాగానే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా నీతితో నిప్పుగా రాజకీయాలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయం నిర్థారణ అయితే దానిని ఎందుకు ఖండించడం లేదన్నారు. ఓటుకు నోటు విషయంలో ఆయన పాత్ర నిర్థారణ కావడంతో బెంబేలెత్తి అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు సెక్షన్-8 పేరుతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన అనంతరం సెక్షన్-8 అమలు జరగాల్సి ఉన్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు వివాదంలో కూరుకుపోయిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేకుండానే ప్రకాశం, కర్నూలులో అభ్యర్థులను నిలబెట్టి పోలీసుల సహకారంతో ఇతర పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి అక్రమంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయలనకు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. -
ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్‌కు లేఖ
-
'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే'
ఏలూరు : సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌పైనే ఉందని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి అయ్యన్నపాత్రుడుతోపాటు జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... గవర్నర్ పాత్ర సమంజసంగా లేదన్నారు. గవర్నర్ పక్షపాతం లేకుండా సమస్యను పరిష్కరించాలని... అలాగే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఉంటామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దౌర్జన్యం చేస్తే మర్యాదగా ఉండదని... మీకు దిక్కున్నది మీరు చేసుకోండని టీఆర్ఎస్ సర్కార్‌ను అయ్యన్న హెచ్చరించారు. మీ పోలీసులు మీకుంటే మా పోలీసులు మాకుంటారు... అలాగే మీ సీబీఐ మీకుంటే మా సీబీఐ మాకుంటుందన్నారు. నిట్ విషయంలో గందరగోళమే లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే నిట్ ఏర్పాటవుతుందని తెలిపారు. అయితే టీడీపీ నేతల మధ్య విభేదాలు లేవని... బేధాభిప్రాయాలు మాత్రమేనని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. -
'సెక్షన్-8 పై అసత్య ప్రచారం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ -8 అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కుట్రలో భాగంగానే ఇలాంటి దుష్ర్పచారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. పత్రికల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
'తప్పులు కప్పి పుచ్చుకునేందుకే సెక్షన్ -8'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకే సెక్షన్- 8 ప్రస్తావన తెచ్చారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తునంటూ విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతుల కోసం రూ.30,990 కోట్ల రుణ పరిమితి విధానాన్ని ఆమోదించినట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైతులకు బ్యాంకుల నుంచి రూ.23,200 కోట్ల రుణాలు అందజేశామని.. దాంతో పాటుగా 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ పత్రాలు అందించామని పోచారం పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులోనే ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ చక్కగా వ్యవహరిస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. -
'చంద్రబాబు ఒత్తిడి తేవడం దుర్మార్గం'
హైదరాబాద్: సెక్షన్ - 8ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సెక్షన్ -8 ను టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని... విభజన బిల్లు రూపకల్పనప్పుడే యూపీఏ పెద్దలకు తమ పార్టీ నేత కేసీఆర్ తెగేసి చెప్పారన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి... ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇబ్బందులు ఉన్నాయనటం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి కార్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒత్తిళ్లకు కేంద్రం సెక్షన్ - 8 అమలు చేస్తుందని టీఆర్ఎస్ భావించడం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓ వేళ అదే జరిగితే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాక్షేత్రంలో పోరాడుతామని కార్నె ప్రభాకర్ వివరించారు. -
'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'
హైదరాబాద్: విభజన చట్టం ప్రకారమే సెక్షన్ -8 ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆంధ్రప్రదేశ్ టీడీపీ విప్ కోన రవికుమార్ సూచించారు. సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం కూడా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్ - 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్‌లో కోన రవికుమార్ స్పందించారు. విభజన చట్టం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. విద్యుత్, నీరు, ఇతర అంశాలన్నీ విభజన చట్టం ప్రకారమే జరిగిందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని తమ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు కలసి విజ్ఞప్తి చేసిన ఆయన స్పందించకపోవడం దారుణమని కోన రవికుమార్ ఆరోపించారు.