'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు' | Kuna Ravikumar takes on kcr due to section -8 | Sakshi
Sakshi News home page

'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'

Published Tue, Jun 16 2015 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'

'సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం చెల్లదు'

హైదరాబాద్: విభజన చట్టం ప్రకారమే సెక్షన్ -8 ఉందన్న వాస్తవాన్ని గ్రహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆంధ్రప్రదేశ్ టీడీపీ విప్ కోన రవికుమార్ సూచించారు. సెక్షన్ -8 చెల్లదంటే విభజన చట్టం కూడా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్ - 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్లో కోన రవికుమార్ స్పందించారు.

విభజన చట్టం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. విద్యుత్, నీరు, ఇతర అంశాలన్నీ విభజన చట్టం ప్రకారమే జరిగిందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని తమ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్కు కలసి విజ్ఞప్తి చేసిన ఆయన స్పందించకపోవడం దారుణమని కోన రవికుమార్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement