లీక్‌లో కోదాడ లింక్! | Kodada link to leak ! | Sakshi
Sakshi News home page

లీక్‌లో కోదాడ లింక్!

Published Mon, Aug 1 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

Kodada link to leak !

సీఐడీ అదుపులో వైద్యుడు

కోదాడ: ఎంసెట్-2 లీక్‌లో నల్లగొండ జిల్లా కోదాడకు లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం కోదాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి కోసం కోదాడకు చెందిన మరో సీనియర్ వైద్యుడి సాయంతో ఈయన ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు సమాచారం ఇవ్వడంతో కోదాడకు వచ్చిన సీఐడీ అధికారులు ఆ వైద్యుడిని ప్రశ్నించి తమతో పాటు తీసుకెళ్లినట్లు తెలిసింది.

సీనియర్ వైద్యుడు గత కొన్నేళ్లుగా ఇదే దందాను కొనసాగిస్తూ ఇందులో ఆరితేరినట్లు పుకార్లు వస్తున్నాయి. పేపర్ కొనుగోలులో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈయన.. తనకు ఆప్తుడైన కోదాడకు చెందిన ఓ వ్యాపారి మనుమరాలికి కూడా ఎంసెట్-2 పేపర్‌ను అందించినట్లు సమాచారం. కోదాడలోనే  చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసే కాంట్రాక్టర్ కూడా తన కుమార్తె కోసం దళారుల వద్ద ఎంసెట్-2 పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement