
సాక్షి, హైదరాబాద్: ‘కొలువుల కొట్లాట’ పేరిట ఈ నెల 31న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.కోదండరామ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్‌ను గురువారం హైకోర్టు విచారించే అవకాశముంది. నిజాం కాలేజీ గ్రౌండ్, సరూర్‌నగర్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం, ఎల్బీనగర్–ఉప్పల్ మధ్య బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని తాము పోలీసులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈనెల 9, 13 తేదీల్లో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదని, అందుకే కోర్టు ద్వారా అనుమతి కోరుతున్నామని కోదండరామ్ రిట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment