rit petition
-
'ఎస్ఈసీ పిటిషన్ ఆమోదయోగ్యంగా లేదు'
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ తన వాదన వినిపించారు. 'రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్ విచారణకు ఆమోదయోగ్యమైనది కాదు.ఎన్నికల ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.సీఎస్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది.. ఆ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ గురించి ఏజీ శ్రీరామ్ ధర్మాసనంకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రభుత్వం ముందు వ్యాక్సిన్ అందిస్తుందని పేర్కొన్నారు. -
ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ, 243 యు నిర్దేశించిన ప్రకారం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీన్ని గౌరవించలేదని నివేదించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ పాలనతోపాటు కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్లో తెలిపింది. హై కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారిని సంప్రదించకుండా ఆపడం తగదని పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరింది. -
పోలీసులపైకి ‘రివర్స్’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసులపై తప్పుడు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు, దర్యాప్తు అధికారి ఏసీపీ విజయ్‌కుమార్‌తో పాటు డీసీపీ అవినాష్ మహంతి తదితరులపై వరుసపెట్టి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో శైలేష్ దాఖలు చేసిన మూడింటితో కలిపి మొత్తం 60 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సీసీఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాదులు శైలేష్ సక్సేనా, సంజయ్ సక్సేనా తదితరులు భోజగుట్టతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న 4 ఖరీదైన స్థలాలపై కన్నేశారు. బోగస్ డాక్యుమెంట్లు, నకిలీ యజమానులను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ పలు స్థలాలపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారంపై నమోదైన ఆరు కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేశారు. దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పథకమే.. అప్పట్లో బాధితులుగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై శైలేష్ ప్రైవేట్ కేసులు నమోదు చేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదులు చేశారని, రాజకీయ కారణాలతోనే సీసీఎస్ అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సివిల్ వివాదాల్లో సీసీఎస్ పోలీసులు తలదూర్చి తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. శైలేష్ సక్సేనా దాఖలు చేసే రిట్ పిటిషన్లలో అధికంగా అధికారుల పేర్లతోనే వేస్తున్నారు. దీంతో అధికారులే సొంతంగా లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. -
ఐటీ గ్రిడ్స్ నిందితుల బెయిల్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వైఎస్ జగన్ రిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్: తనపై అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతను ఏపీ ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నంలో పెద్ద కుట్ర దాగి ఉందని రిట్ పిటిషన్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై సైతం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో దాఖలు అయిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. సంబంధిత కథనాలు నిష్పాక్షిక దర్యాప్తు జరిపించండి స్వతంత్ర దర్యాప్తునకు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించండి అలిపిరి దాడి భువనేశ్వరే చేయించారంటే..? -
కొలువుల కొట్లాట’కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: ‘కొలువుల కొట్లాట’ పేరిట ఈ నెల 31న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.కోదండరామ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్‌ను గురువారం హైకోర్టు విచారించే అవకాశముంది. నిజాం కాలేజీ గ్రౌండ్, సరూర్‌నగర్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం, ఎల్బీనగర్–ఉప్పల్ మధ్య బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని తాము పోలీసులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈనెల 9, 13 తేదీల్లో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదని, అందుకే కోర్టు ద్వారా అనుమతి కోరుతున్నామని కోదండరామ్ రిట్లో పేర్కొన్నారు. -
సంప్రదాయమా..? చట్ట నిబంధనలా..?
* పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని ‘హెబియస్’ రూపంలో సవాలు చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ * అయితే ఇది 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయమన్న సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి * దీంతో హెబియస్ కార్పస్ రూపంలోనా.. రిట్ పిటిషన్ రూపంలోనా... అనేది తేల్చాలని హైకోర్టు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఏ వ్యక్తినైనా పోలీసులు ముందస్తు నిర్బంధ చట్టం(పీడీ యాక్ట్) కింద నిర్బంధిస్తే దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడం యాభై ఏళ్ల నుంచి హైకోర్టులో వస్తున్న సంప్రదాయం.. పీడీ కేసుల్లో వ్యక్తి నిర్బంధాన్ని సవాలుచేస్తూ హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్ వేయడానికి వీల్లేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మౌఖికంగా జారీచేసిన ఆదేశం.. గత 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న కీలక విషయాన్ని తేల్చాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. దీనిపై లోతైన విచారణ జరపనున్నట్టు పేర్కొంది. తమ భర్తలను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారని, వారిని వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన జి.అర్చన, చిత్తూరుకు చెందిన బి.హిమబిందు వేర్వేరుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ రూపంలో పిటిషన్లు వేశారు. ఇవి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం విచారణకొచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల భర్తలైన జి.రామనాథరెడ్డి, నాగేంద్రనాయక్లను పోలీసులు పీడీ యాక్ట్ కింద అక్రమంగా నిర్బంధించారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన కేసులను ఇలా హెబియస్ కార్పస్ రూపంలో దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వాటిని రిట్ పిటిషన్ రూపంలో సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసుకోవాలని, ఇదే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఏజీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బాంబే హైకోర్టు కూడా ఈ విషయాన్ని చెప్పిందని వ్యాఖ్యానించింది. దీనికి మోహన్‌రెడ్డి అడ్డుచెబుతూ.. గత 50 ఏళ్లుగా ఉమ్మడి హైకోర్టులో పీడీ కేసుల్లో నిర్బంధాన్ని హెబియస్ కార్పస్ రూపంలోనే సవాలు చేస్తూ వస్తున్నామని, అదిక్కడ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పీడీ కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకూడదని రాజ్యాంగంలోగానీ, చట్ట నిబంధనల్లోగానీ, సుప్రీంకోర్టు తీర్పుల్లోగానీ ఎక్కడా లేదని, ఏజీకి సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసని వివరించారు. సంప్రదాయం కొనసాగుతున్న మాట వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. దీంతో ధర్మాసనం, అయితే సంప్రదాయాన్ని కొనసాగించాలా..? లేక చట్ట నిబంధనలను అమలు చేయాలా..? అన్న విషయంపై లోతైన విచారణ చేపడతామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెలువరించిన తీర్పులేవైనా ఉంటే, వాటిని తమ ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
సవాల్
సుప్రీం కోర్టులో రాష్ర్ట ప్రభుత్వం రిట్ ఆ ఏడుగురి విడుదలకు వినతి కేంద్రం అనుమతి అవసరం లేదు రాజీవ్ హత్య కేసు వ్యవహారంలో జయ సర్కారు సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం కేంద్రానికి లేదని ఆ పిటిషన్లో వివరించారు. సంప్రదాయం మేరకు గౌరవ సూచకంగా వారికి తెలియజేయాల్సిన అవసరం మాత్రమే ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును విన్నవించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరరివాలన్, శాంతన్, మురుగన్ ఉరి శిక్ష , నళిని, రాబర్ట్, రవి, జయకుమార్ యావజ్జీవ శిక్ష ఎదుర్కొంటూ వచ్చిన విషయం తెలిసిందే. క్షమాభిక్షల పిటిషన్లలో జాప్యంతో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఉరి శిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో శాంతన్, పేరరివాలన్, మురుగన్‌కు విముక్తి కలిగినట్టు అయింది. అదే సమయంలో ఏళ్ల తరబడి వేలూరు జైల్లో మగ్గుతూ వస్తున్న నింధితులకు స్వేచ్చాయుత జీవితాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు విడుదల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టడం ఓ వరంగా మారింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని తమిళాభిమానాన్ని చూరగొనే రీతిలో ఆ ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నివేదికను కేంద్రం దృష్టికి పంపింది. పిటిషన్లు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం మోకాలొడ్డింది. ప్రభుత్వ నివేదికకు సమాధానం ఇవ్వకుండా, ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ వాదన విన్పించడంతో విడుదలకు బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు స్టే కారణంగా ఆ ఏడుగురు జైళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యూయి. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో పాటుగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. కేంద్రం పిటిషన్‌ను సవాల్ చేస్తూ మంగళవారం ఉదయం సుప్రీం కోర్టులో రిట్పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. రిట్ పిటిషన్: రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుబ్రమణ్య ప్రసాద్ సుప్రీం కోర్టులో ఈ రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. ఉరి శిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు, విడుదల అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తు చేశారు. ఆ మేరకు ఆ ఏడుగురి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని పరిశీలించి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. తమ నివేదికకు వివరణ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ విషయాన్ని మరచి నేరుగా కోర్టును ఆశ్రయించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉందని, కేంద్రంతో సంప్రదాయ బద్ధంగా, గౌరవ సూచకంగా మాత్రమే వివరణ కోరాల్సి ఉందన్నారు. ఆ ఏడుగురిని విడుదల చే యడానికి లేదా బంధించడానికి కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని వివరించారు. భార త రాజ్యంగంలోని సెక్షన్ 432, 432ఎ ప్రకారం వారిని విడుదల చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చట్ట నిబంధనలకు లోబడి వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటే, కోర్టు ద్వారా దాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం విచారకరంగా పేర్కొన్నారు. కేంద్రం తీరును తాము అంగీకరించబోమని, వారు దాఖలు చేసిన పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దానిని తోసి పుచ్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిట్ దాఖలు చేయడంతో ఈలం మద్దతు తమిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన మొదటి బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ అదే రోజు జరుగనుండడంతో, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను అదే రోజు విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన బెంచ్ స్వీకరించబోతున్నదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వినతి: ఇక రాష్ట్రంలోని జైళ్లల్లో మగ్గుతున్న మైనారిటీలను విడుదల చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉదయం ఇండియ దేశీయ లీగ్ నేతృత్వంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున సచివాలయూనికి తరలి వచ్చారు. సీఎం జయలలితకు వినతి పత్రం సమర్పించారు. రాజీవ్ హత్యకేసు నిందితుల విడుదలకు చర్యలు తీసుకున్నట్టుగానే, తమ వాళ్ల విడుదలకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో మైనారిటీలను గతంలో అనుమానం పేరుతో, కుట్రల పేరుతో పట్టుకెళ్లి జైళ్లలో బంధించారని వివరించారు. ఆ కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. 16 ఏళ్లకు పైగా జైళ్లల్లో మగ్గుతున్న వారందరినీ విడుదల చేయాలని, ఆ కుటుంబాల్లో ఆనందం నింపాలని విన్నవించారు.