వైఎస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా | YS Jagans RIT Petition trial Postponed | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Published Thu, Nov 1 2018 12:11 PM | Last Updated on Thu, Nov 1 2018 12:51 PM

YS Jagans RIT Petition trial Postponed - Sakshi

హైదరాబాద్‌: తనపై అక్టోబర్‌ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతను ఏపీ ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నంలో పెద్ద కుట్ర దాగి ఉందని రిట్‌ పిటిషన్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై సైతం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో దాఖలు అయిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిల్‌ దాఖలైన సంగతి తెలిసిందే.
 

సంబంధిత కథనాలు

నిష్పాక్షిక దర్యాప్తు జరిపించండి

స్వతంత్ర దర్యాప్తునకు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌

స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించండి

అలిపిరి దాడి భువనేశ్వరే చేయించారంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement