
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్ వేసిన క్యారికేచర్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నాయని.. రవీంద్రభారతిలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరిట ఏర్పాటు చేసిన ఆయన ప్రదర్శనను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు కార్టూన్ల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను అందులో ఉంచారు. దీంతోపాటు కొన్ని క్యారికేచర్లను షేర్ చేస్తూ.. ‘ఇవి శంకర్ వేసిన అద్భుతమైన చిత్రాల్లో కొన్ని మాత్రమే.. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఆయన ప్రదర్శనను తప్పక తిలకించండి’ అని నెటిజన్లను కోరారు. ఈ ప్రదర్శన ఈ నెల 18 వరకూ కొనసాగనుంది.
Some more superb works from the gallery of Sri Shankar Pamarthy
— KTR (@KTRTRS) February 10, 2019
Please visit the gallery at Ravindra Bharathi pic.twitter.com/2HbG74mBPb
Comments
Please login to add a commentAdd a comment