
నర్సమ్మను అంబులెన్స్‌లో తరలిస్తున్న వైద్య సిబ్బంది
కొత్తకోట రూరల్: మండల పరిధిలోని నాటవెళ్లి గ్రామానికి చెందిన నర్సమ్మ(60) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఎడమకాలికి గాయమై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటికి వెళ్లలేక బాధపడుతుండటంతో స్థానిక యువకులు గమనించారు. సమస్యను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్తకోట పీహెచ్‌సీ డాక్టర్ సౌజన్యలత, తహసీల్దార్ రమేష్‌రెడ్డితో కలిసి నాటవెళ్లికి చేరుకొని నర్సమ్మను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment