కూసుమంచిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షి, కూసుమంచి: కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ మశీదు లేనిదే ఏ పని అవ్వదు. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే వారి నుంచి సిబ్బంది అందినకాడికి పిండుకుంటున్నారు. కార్యాలయంలో ప్రైవేటుగా పనిచేస్తున్న కొందమంది సబ్‌రిజిçస్ట్రార్‌తో పాటు ఇతర సిబ్బందితో చేతులు కలిపి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించారు. దీనిలో భాగంగా సోమవారం కార్యాలయంలో రూ.2 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవి, అటెండర్ జానీ, ప్రైవేటు వ్యక్తి (డాక్యుమెంట్ రైటర్) అనినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కిన సంగతి విధితమే. దీంతో కార్యాలయంలో లంచం లేనిదే పనులు జరిగే పరిస్థితి జరగదన్న సంగతి జగమెరిగింది.
స్టాంపుల సొమ్ము మాయంలో..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యాలయంలో 2017 అక్టోబర్‌లో రూ.16 లక్షల రిజిస్ట్రేషన్ స్టాంపుల సొమ్ము మాయంలో షరాఫ్(క్యాషియర్‌గా) పనిచేస్తున్న బద్దె శ్రీనివాసరావుతో పాటు దాంట్లో ప్రయేయం ఉన్న నాటి సబ్‌రిజిస్ట్రార్ యామినిపై కూడా సస్సెన్షన్ వేటు పడింది.
రసీదు.. మశీదు..
కూసుమంచి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాలకు చెందిన భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు జరగుతుంటాయి. దీంతో ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్లకు రసీదు చెల్లించినా కార్యాలయ సిబ్బందికి అంతకంటే ఎక్కువ మశీదు రూపంలో లంచం చెల్లించాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ కార్యాలయ పరిధిలో జోరుగా సాగుతుండగా సిబ్బందికి చేతినిండా డబ్బులే. పలుకుబడి కలిగిన వ్యక్తుల భూముల రిజిస్ట్రేషన్లు అంటే సిబ్బందే అన్నీ తామై చూసుకుంటారు. భారీగానే ముడుపులు స్వీకరిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కిందిస్థాయి సిబ్బంది నుంచి సబ్‌రిజిస్ట్రార్ వరకు అందరికీ వాటాలు అందాల్సిందే. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించే తతంగం. కాగా ఈ కార్యాలయం ఏడాదికి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందాల్సి ఉండగా లక్ష్యం నెరవేరలేని పరిస్థితి ఉందంటే సిబ్బంది చేతివాటం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment