అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి | l. ramana slams kcr over cabinet expansion | Sakshi
Sakshi News home page

అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

Published Wed, Dec 17 2014 2:29 AM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM

అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి - Sakshi

అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

* టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం కావాలనే భావన కూడా లేని వ్యక్తులకు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించినందుకు, బలిదానాలు చేసిన అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమానికి ఊతమిచ్చిన మహిళలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిన్నచూపు చూశారని విమర్శించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా కేబినెట్‌లో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పారు. ఒకటి, రెండు సామాజిక వర్గాలకే ప్రాధాన్యతనిచ్చి, తెలుగుదేశం ప్రభుత్వానికి ముందు పాలనను టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి తెచ్చిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement