
'ఎన్టీపీసీ యూనిట్లకు స్థలసేకరణ'
రాబోయే వేసవిలో కరెంట్ కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీలో మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేయనుందని జాయింట్ కలెక్టర్ పౌసమిబసు చెప్పారు .
కరీంనగర్: రాబోయే వేసవిలో కరెంట్ కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీలో మరో రెండు యూనిట్లను ఏర్పాటు
చేయనుందని జాయింట్ కలెక్టర్ పౌసమిబసు చెప్పారు . ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్లను కరీంనగర్ జిల్లా
రామగుండం మండలం జ్యోతినగర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా యూనిట్లకు అవసరమైన బూడిద చెరువు(యాష్ పాండ్) స్థలాన్ని జాయింట్ కలెక్టరు మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ స్థలం రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉందని, త్వరలోనే అనుమతులు తీసుకొని స్థల సేకరణ చేస్తామని చెప్పారు.
(జ్యోతినగర్)