నిర్మాణం చేసే ప్రాంతంలో అధికారులు
నాగార్జునసాగర్ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో శాశ్వతలాంచీస్టేషన్, జట్టీ, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తికావడంతో పనులు చేసేందుకు తెంలగాణ పర్యాటక అభివృద్ధిసంస్థ అధికారులు స్థలాన్ని సంబంధిత కంపెనీకి గురువారం అప్పగించారు. రాష్ట్ర విభజనలో భాగంగా గతంలో సాగర్‌లో ఉన్న లాంచీస్టేషన్, జట్టీ, లాంచీలు ఆంధ్రప్రధేశ్ పర్యాటక అభివృద్ధిసంస్థకు వెళ్లాయి. దీంతో తాత్కాలిక లాంచీస్టేషన్ ద్వారా పర్యాటకులను నాగార్జునకొండకు పంపుతున్నారు.
గత మూడేళ్ల క్రితమే లాంచీస్టేషన్ నిర్మాణానికిగాను నీతి అయోగ్ రూ.4.5కోట్ల నిధులు మంజూరు చేసింది. టూరిజం అధికారులు లాంచీస్టేషన్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సాక్షిపత్రిక నిధులున్నా శాశ్వతలాంచీస్టేషన్ నిర్మించరా అని కథనాలను ప్రచురించింది. దీనికి స్పందించిన అ«ధికారులు ఎట్టకేలకు విజయవిహార్ దిగువభాగాన స్థలాన్ని నిర్ధారించి గతనెలలో టెండర్లు పిలిచారు. హిమసాయి కన్‌స్ట్రక్షన్‌కు నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌ను దక్కిం చుకుంది. వారికి టూరిజం ఎస్‌ఈ క్రాంతికుమార్ నిర్మాణాలు చేయాల్సిన ప్రాంతాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు చూయించారు.
తొమ్మి మాసాల్లో పనులు పూర్తి
ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్‌ఈ క్రాంతికుమార్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే బుద్ధిజానికి పెద్దపీటవేస్తూ సాగర్ జలాశయతీరంలో శ్రీపర్వతారామం నిర్మాణమవుతోంది. దీనికి దీటుగా అం తర్జాతీయ స్థాయిలో పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేవిదంగా లాంచీస్టేషన్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. దిగువకు ఎస్ ఆకారంలో రోడ్డు, నూతన సాంకేతికతను వినియోగించుకుని లాంచీస్టేషన్, జట్టీ నిర్మాణాలను తొమ్మిది మాసాల్లో పూ ర్తి చేస్తామని తెలిపారు. వీరి వెంట ఏఈ ఆంజనేయులు, అశోక్, మేనేజర్ హరి, సర్వేయర్ రవి, కాంట్రాక్టర్ కంకణాల ప్రవీణ్‌రెడ్డిలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment