అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీకే సాధ్యం | leaders are going to ysrcp | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీకే సాధ్యం

Published Mon, Apr 7 2014 12:06 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీకే సాధ్యం - Sakshi

అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీకే సాధ్యం

మంచాల, న్యూస్‌లైన్: ప్రాంతాలకతీతంగా అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అందించే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆస్మత్‌పూర్ గ్రామంలో పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సపావట్ సునీతకు మద్దతు నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఇంటింటికీ తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఎంతోమంది అర్హులు సంక్షేమ  పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని, నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధికారం కోసం పాకులాడుతోందని విమర్శించారు.
 
రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ప్రాదేశికం నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదలందరికీ మేలు జరగాలన్న రాజన్న ఆశయ సాధనకే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. విద్యావంతురాలైన సపావట్ సునీతను ఎంపీటీసీగా గెలిపించాలని, అందుకోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
 
 వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
ఈ సందర్భంగా గ్రామంలో పలు పార్టీలకు చెందిన పలువురు ఈసీ శేఖర్ గౌడ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 పార్టీలో చేరిన వారిలో పుట్ట బుగ్గయ్య, మంతని అంజయ్య, మల్లయ్య, నర్ర రమేష్, మంగలి పాపయ్య, నర్ర సత్తయ్య, పుట్ట సత్తయ్య, మల్లమ్మ, నర్ర పోచమ్మ, బొలిపోతు పెంటమ్మ, మంతని అచ్చమ్మ, బుచ్చమ్మ, పద్మమ్మ తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల  కన్వీనర్ మాదగోని జంగయ్య గౌడ్, యూత్ కన్వీనర్ నల్ల ప్రభాకర్, నాయకులు దూసరి బాలశివుడు గౌడ్, మెగావత్ నరేందర్‌నాయక్, పార్టీ జాపాల గ్రామ శాఖ  కన్వీనర్ బి.శ్రీకాంత్, నాయకులు ఓరిగంటి మధు గౌడ్, సంగం భాస్కర్, ఎ.బాషా, ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement