EC Shekhar Goud
-
గులాబీలో డిష్యుం డిష్యుం!
- వీధికెక్కిన ‘పట్నం’రాజకీయాలు - రెండుగా చీలిన టీఆర్ఎస్ - మంచిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు - వైరివర్గాలతో జతకట్టిన ఎంపీ బూర ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా గులాబీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు వీధికెక్కింది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ రచ్చకెక్కింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయం వేడెక్కింది. నాలుగు నెలల క్రితం మంచిరెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో లుకలుకలకు దారితీసింది. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మరో సీనియర్ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఈ పరిణామంతో డీలా పడ్డారు. ఈ క్రమంలోనే ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో కంచర్ల పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయన వర్గీయులను కూడా తనవైపు తిప్పుకునేందుకు మంచిరెడ్డి అనుసరిస్తున్న వైఖరితో గుస్సా మీద ఉన్న ఆయన ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈసీ శేఖర్‌గౌడ్ ఏకంగా విలేకర్ల సమావేశం పెట్టి మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలను సంధించారు. భూ అక్రమాలకు పాల్పడుతూ పార్టీ విలువలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. నావేలితో నాకన్నే పొడిపించారు మరోవైపు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఎమ్మెల్యే వైఖరిపై కినుక వహించినట్లు తెలిసింది. వైరివర్గాలకు అనుకూలంగా మాట్లాడిన తీరు ఆయన అసమ్మతిని బయటపెట్టింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో నేను మాట్లాడితే.. మరొకరు చెక్కులను పంపిణీ చేయడమేమిటనీ’ ఆయ న ఇబ్రహీంపట్నంలో విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ‘రాజకీయాల్లో నేనొక అజ్ఞానినని, నా వేలితోనే నా కంటిని పొడిపించిన మేధావులు ఇక్కడి వారని’ పరోక్షంగా మంచిరెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం చూస్తే ‘పట్నం’ లో గ్రూపురాజకీయాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ వర్గీయుడిగా గుర్తింపు పొందిన ఈసీ శేఖర్‌గౌడ్ విలేకర్ల సమావేశం పెట్టడం చర్చకు తెరలేపింది. మహేందర్‌తో కంచర్ల భేటీ ఇదిలావుండగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో బుధవారం చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అ య్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించిన చంద్రశేఖర్‌రెడ్డి.. తనవర్గీయులకు జరుగుతు న్న అన్యాయంపై ఏకరువు పెట్టినట్లు తెలిసిం ది. మంచిరెడ్డితో ముందు నుంచి అభిప్రాయబేధాలున్న మహేందర్.. ఈ అంశంపై లోతు గా వెళ్లకుండా.. పరిస్థితులను చక్కదిద్దుతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుండగా, మంచిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. ఈ మేరకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. -
జనహర్ష భూములను సర్వే చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: జనహర్ష రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, భూదాన, పేదల భూములను ఆక్రమించి ప్రజల్ని, వినియోగదారుల్ని మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల పొలం, నిరుపేదలకు ఇళ్ల స్థలాల్నిస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణదారుల నుంచి భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. జనహర్ష రియల్ ఎస్టేట్ అధినేతలు పేదలు సాగు చేసుకునే వ్యవసాయ పొలాల్ని అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారని ఆరోపించారు. సుమారు 10వేల ఎకరాల భూముల్ని ఆక్రమించారన్నారు. మంచాల మండలంలోని లింగంపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, నైల్లి, సీతారాంపేట, చర్లపటేల్‌గూడ గ్రామాల్లో రైతులు సాగు చేసుకుం టున్న పొలాలపై కన్నేసి వారిని బెదిరించి కారుచౌకగా కొనుగోలు చేశారని మండిపడ్డారు. జనహర్షలో ఏ ఒక్క వెంచర్‌కూ లేఅవుట్ పర్మిషన్ లేదన్నారు. కలెక్టర్, ఆర్డీఓ ఈ భూములపై సర్వే నిర్వహించి ఆక్రమణలో ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు.. జనహర్ష రియల్ ఎస్టేట్ సంస్థ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వినియోగదారుల్ని మోసం చేస్తోందని పోల్కంపల్లి పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మణరావు ఆరోపిం చారు. జనహర్ష ఆగడాలను నివారించాలని ఆయన శేఖర్‌గౌడ్‌తో కలిసి చర్చిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరి చర్యలను తప్పుబడుతూ గ్రామ పంచాయతీ అధికారులు గతంలో నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ సదరు సంస్థ వినకుండా ఇష్టారాజ్యంగా తన వ్యవహారాన్ని కొనసాగిస్తోందని అన్నారు. నాగన్‌పల్లి గ్రామంలో 258, 259, 260 సర్వే నంబర్లలో గ్రామ పంచాయతీ సిబ్బంది హద్దురాళ్లను సైతం తొలగించినా వాటిని భేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ టౌన్ అధ్యక్షుడు ముత్యాల శ్రీహరి, నాయకులు బాబు, కృష్ణ, రాఘవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో వైఎస్సార్ సీపీదే ప్రభంజనం
* ఆ పార్టీకి 150కిపైగా ఎమ్మెల్యే సీట్లు, 22కుపైగా ఎంపీ సీట్లు వస్తాయి * 2019 కల్లా తెలంగాణలో మరింత బలోపేతమవుతాం * వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ యాచారం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సా ర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఆ పార్టీకి 150కి పైగా ఎమ్మెల్యే, 22కుపైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని, తద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని నక్కర్తమేడిపల్లిలో జరిగిన ఓ విలేకరి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కృషి చేసే శక్తి కేవలం జగన్మోహన్రెడ్డికే మాత్రమే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్‌లు ఒక్కటై ఎంత ప్రచారం చేసినా సీమాంధ్ర ప్రజలు జగన్ నాయకత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేసుకోవాల్సిందేనని చెప్పారు. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ కేవ లం పేదల సంక్షేమం కోసం మా త్రమే పనిచేస్తుందని అన్నారు. సీమాంధ్రలో జగన్మోహన్రెడ్డి సీఎం అయితే తెలంగాణలోనూ పార్టీ బలోపేతమవుతుంద ని తెలిపారు. 2019 కల్లా తెలంగాణలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కూలీలతో వరి కోతలు కోయించండి జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలో వడగళ్ల వర్షానికి రైతులు వందలాది ఎకరాల వరి పంట నష్టపోయారని ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. నష్టపోయిన వరిని ఉపాధి కూలీల ద్వారా కోయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గురువారం పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, నాయకుడు దార నర్సింహతో కలిసి ఎంపీడీఓ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. వడగళ్ల వల్ల గింజ కూడా పంటపై లేదని కూలీల ద్వారా కోయిస్తే రైతులకు పశుగ్రాసమైనా దక్కుతుందన్నారు. నష్టపోయిన పంటల వివరాలను త్వరగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. -
అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీకే సాధ్యం
మంచాల, న్యూస్‌లైన్: ప్రాంతాలకతీతంగా అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అందించే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆస్మత్పూర్ గ్రామంలో పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సపావట్ సునీతకు మద్దతు నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.ఇంటింటికీ తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. ఎంతోమంది అర్హులు సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని, నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధికారం కోసం పాకులాడుతోందని విమర్శించారు. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ప్రాదేశికం నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదలందరికీ మేలు జరగాలన్న రాజన్న ఆశయ సాధనకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. విద్యావంతురాలైన సపావట్ సునీతను ఎంపీటీసీగా గెలిపించాలని, అందుకోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక ఈ సందర్భంగా గ్రామంలో పలు పార్టీలకు చెందిన పలువురు ఈసీ శేఖర్ గౌడ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పుట్ట బుగ్గయ్య, మంతని అంజయ్య, మల్లయ్య, నర్ర రమేష్, మంగలి పాపయ్య, నర్ర సత్తయ్య, పుట్ట సత్తయ్య, మల్లమ్మ, నర్ర పోచమ్మ, బొలిపోతు పెంటమ్మ, మంతని అచ్చమ్మ, బుచ్చమ్మ, పద్మమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మాదగోని జంగయ్య గౌడ్, యూత్ కన్వీనర్ నల్ల ప్రభాకర్, నాయకులు దూసరి బాలశివుడు గౌడ్, మెగావత్ నరేందర్‌నాయక్, పార్టీ జాపాల గ్రామ శాఖ కన్వీనర్ బి.శ్రీకాంత్, నాయకులు ఓరిగంటి మధు గౌడ్, సంగం భాస్కర్, ఎ.బాషా, ఎం.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.