సీమాంధ్రలో వైఎస్సార్ సీపీదే ప్రభంజనం
* ఆ పార్టీకి 150కిపైగా ఎమ్మెల్యే సీట్లు, 22కుపైగా ఎంపీ సీట్లు వస్తాయి
* 2019 కల్లా తెలంగాణలో మరింత బలోపేతమవుతాం
* వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్
యాచారం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సా ర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఆ పార్టీకి 150కి పైగా ఎమ్మెల్యే, 22కుపైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని, తద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని నక్కర్తమేడిపల్లిలో జరిగిన ఓ విలేకరి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కృషి చేసే శక్తి కేవలం జగన్‌మోహన్‌రెడ్డికే మాత్రమే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్‌లు ఒక్కటై ఎంత ప్రచారం చేసినా సీమాంధ్ర ప్రజలు జగన్ నాయకత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు.
చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేసుకోవాల్సిందేనని చెప్పారు. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ కేవ లం పేదల సంక్షేమం కోసం మా త్రమే పనిచేస్తుందని అన్నారు. సీమాంధ్రలో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే తెలంగాణలోనూ పార్టీ బలోపేతమవుతుంద ని తెలిపారు. 2019 కల్లా తెలంగాణలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
కూలీలతో వరి కోతలు కోయించండి
జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలో వడగళ్ల వర్షానికి రైతులు వందలాది ఎకరాల వరి పంట నష్టపోయారని ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. నష్టపోయిన వరిని ఉపాధి కూలీల ద్వారా కోయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గురువారం పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, నాయకుడు దార నర్సింహతో కలిసి ఎంపీడీఓ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. వడగళ్ల వల్ల గింజ కూడా పంటపై లేదని కూలీల ద్వారా కోయిస్తే రైతులకు పశుగ్రాసమైనా దక్కుతుందన్నారు. నష్టపోయిన పంటల వివరాలను త్వరగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.