జ్యోతిప్రజ్వలన చేస్తున్న అశోక్
సప్తగిరికాలనీ(కరీంనగర్): యువత నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి జి.అశోక్‌కుమార్ అన్నారు. నెహ్రు యువ కేంద్ర కార్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే ‘యూత్ అండర్‌షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక ఆహ్వానితుడు కె.మురళి మాట్లాడుతూ యువత బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని అన్నారు. కుటుంబ సంబంధాలపై వివరించారు. ఎన్‌వైకే సహాయకుడు బి.రవీందర్, నాయకులు మురళీకృష్ణ, కళింగ శేఖర్, కిరణ్‌కుమార్, కోండ రవి, సత్తినేని శ్రీనివాస్, బందారపు అజయ్, మంజులత, కాసిపాక రాజేశ్, వోడ్నాల రాజు, ముత్యాల రమేశ్, ఎన్‌వైకే వలంటీర్లు,, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment