
హైదరాబాద్: భారతదేశంలో వచ్చే 20–30 ఏళ్లలో ఎలక్ట్రికల్ వాహనాలే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తాయని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీఎస్‌వి.ప్రసాద్ పేర్కొన్నారు. రాయదుర్గంలోని దినేష్ ఫిల్లింగ్ స్టేషన్‌లో దేశంలో రెండవ, తెలంగాణలో మొదటి హెచ్‌పీసీఎల్ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్‌ను నాగ్‌పూర్‌లో ప్రారంభించగా.. రెండవది హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ప్రస్తుతం 175 ఎలక్ట్రికల్ వాహనాలు నడుస్తున్నాయని తెలిపారు. త్వరలో ఆర్‌సీ పురం, ఉప్పల్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరో నెల రోజుల్లో దేశంలో మరో 4 నగరాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నామని ప్రకటించారు.
మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలు
నీతి ఆయోగ్ సూచనపై 2030 నాటికి దేశంలో ప్రస్తు తం కొనసాగుతున్న 2.5 కోట్ల మ్యాన్యువల్ రిక్షాల స్థానంలో ఈ–రిక్షాలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని హెచ్ïపీసీఎల్ బిజినెస్ డెవలప్‌మెంట్ సీజీఎం సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
త్వరలో హెచ్‌పీసీఎల్ ఆ«ధ్వర్యంలో బ్యాటరీ, బ్యాటరీ సెల్స్, ఈ–రిక్షాలు, టూ వీలర్ల ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేçస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ అధికారులు శ్రీనివాస్, రాజేశ్, జూమ్‌కార్ల ప్రతినిధి దీపక్, దినేష్ ఫిల్లింగ్ నిర్వాహకులు దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.