వామపక్ష నేతల అరెస్ట్..
Published Sat, Sep 9 2017 2:14 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
సాక్షి, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్ష నేతలను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సీపీఐ నేత నారాయణ సహా పలువురు వామపక్ష నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయలుదేరారు.
వీరిని మాదాపూర్ లో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ 28 శాతం పన్ను భారంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement